War 2 Day 7 Box office Collectons: వారం రోజుల్లో వార్ 2 కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వసూలైందంటే?
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ 2. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను బ్రహ్మాస్త్రం దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయడం విశేషం. యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సందర్భంగా వార్ 2 చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత? 7వ రోజు వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వసూళ్లు చేసింది? వారం రోజుల టోటల్ వసూళ్లు ఎన్ని కోట్లనే వివరాల్లోకి వెళితే..
వార్ 2 మూవీ బడ్జెట్?
జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, అషుతోష్ రాణా, అనిల్ కపూర్ వంటి భారీ తారాగణం నటించారు. మరోవైపు యాక్షన్, స్టంట్స్, మ్యూజిక్, డ్యాన్స్, విజువల్స్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విషయాల్లో టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. దీంతో యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ బ్యానర్ లో నిర్మాత ఆదిత్య చోప్రా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ప్రచార కార్యక్రమాలను భారీగానే ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇలా అన్నీ కలుపుకొని రూ.400 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్? బ్రేక్ ఈవెన్ పాయింట్?
2019లో వచ్చిన వార్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన చిత్రం వార్ 2 కావడంతో సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వార్ 2కు రూ.340 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో తెలుగు రైట్స్ ను టాలెంటెడ్ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ రూ.105 కోట్లకు దక్కించుకోవడం విశేషం. తో దక్కించుకోవడం విశేషం. కర్ణాటక, ఇతర రాష్ట్రాల రైట్స్ ద్వారా రూ.19 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ.56 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుపుతున్నారు. ఓవర్సీస్, నాన్ థియేట్రికల్ ద్వారా మరో 160 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. దీంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.700 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణులు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను నిర్ణయించారు.
వార్ 2కి 6 రోజుల ఇండియా నెట్..
ఓపెనింగ్ డే వార్ 2 చిత్రానికి రూ.52 కోట్ల నెట్, 2వ రోజు 58 కోట్లు, 3వ రోజు రూ.33.25 కోట్లు, 4వ రోజు రూ.33 కోట్లు, 5వ రోజు రూ.8.75 కోట్లు, 6వ రోజు రూ.9 కోట్ల ఇండియా నెట్ వసూలైంది. ఇలా 6 రోజుల్లో రూ.194 కోట్లు ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలతో తెలుస్తోంది. ఇందులో తెలుగులో రూ.50.3 కోట్లు నెట్, తమిళంలో రూ.1.45 కోట్లు, హిందీలో రూ.142 కోట్లు నెట్ వసూలైంది.
వార్ 2కి 7వ రోజు వసూల్..
ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే అందుకుంటోంది. ఆగస్టు 20న బుధవారం వర్కింగ్ డే అయినప్పటికీ సినిమాకు మంచి వసూళ్లే దక్కాయి. 7వ రోజు ఓవరాల్ గా రాత్రి 8 గంటల వరకు తెలుగులో 16 శాతం, తమిళంలో 13 శాతం, హిందీలో 10 శాతం ఆక్యుపెన్సీ దక్కింది. ఇక 7వ రోజు ఇండియా నెట్ రూ.4 కోట్ల వరకు వసూలైందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. మిగితా షోలు కలుపుకొని రూ.6 కోట్ల వరకు నెట్ అందుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వారం రోజుల్లో కలెక్షన్స్..
వార్ 2 చిత్రానికి వారం రోజుల్లో తెలుగులో రూ.51 కోట్లు, తమిళంలో రూ.1.50 కోట్లు, హిందీలో రూ.142 కోట్లు నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ బాక్సాఫీస్ లెక్కలు తెలుపుతున్నాయి. 7రోజుల్లో ఇండియా నెట్ మొత్తం రూ.200 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.250 కోట్లు, ఓవర్సీస్ లో రూ.67 కోట్లు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక మొదటి వారంలో వరల్డ్ వైడ్ మొత్తంగా ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని రూ.317 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇంకా ఈ చిత్రం 300 కోట్లు కలెక్ట్ చేస్తే లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications











