»   » బాహుబలికి దంగల్ దెబ్బ.. ఓవర్సీస్‌లో టఫ్ ఫైట్..1000 కోట్ల క్లబ్‌ దిశగా అమీర్..

బాహుబలికి దంగల్ దెబ్బ.. ఓవర్సీస్‌లో టఫ్ ఫైట్..1000 కోట్ల క్లబ్‌ దిశగా అమీర్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కలెక్షన్ల రేసులో బాహుబలి2 చిత్రానికి అమీర్ ఖాన్ నటించి, నిర్మించిన దంగల్ సినిమా షాక్ ఇస్తున్నది. ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలువాలన్న బాహుబలి ప్రయత్నానికి దంగల్ బ్రేక్ వేస్తున్నది. గతవారం చైనాలో విడుదలైన దంగల్ సినిమా రూ. 100 కోట్లు వసూళ్లను సాధించిన చిత్రంగా ఓ అరుదైన రికార్డును అందుకున్నది. వారాంతంలో రూ.75 కోట్లు సాధించిన దంగల్ చిత్రం సోమవారం కూడా మంచి కలెక్షన్లను సాధించినట్టు వార్తలు అందుతున్నాయి. అమెరికాలో ఇప్పటికే బాహుబలి2 వంద కోట్ల మార్కును దాటింది. ఈ రికార్డుకు పోటీగా దంగల్ సిద్ధమవుతున్నది.

చైనాలో దంగల్ రూ.112 కోట్లు..

చైనాలో దంగల్ రూ.112 కోట్లు..

నోట్ల రద్దు సమయంలో కూడా దంగల్ కలెక్షన్ల మోత మోగించింది. ప్రపంచవ్యాప్తంగా దంగల్ రూ.700 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. చైనాలో తాజా రిలీజ్ తర్వాత కేవలం ఐదు రోజుల్లోనే రూ.112 కోట్ల వసూళ్లను సాధించింది. త్వరలోనే రూ.1000 కోట్ల మార్కును దాటేందుకు ప్రయత్నిస్తున్నది.

విదేశాల్లో బాహుబలి రికార్డును..

విదేశాల్లో బాహుబలి రికార్డును..

దంగల్ చిత్రం చైనాలో తొలి వారాంతానికి (శుక్ర, శని, ఆది) రూ.75 కోట్లు సాధించి విదేశాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డును నమోదు చేసింది. ఇటీవల అమెరికాలో తొలి వారాంతానికి వసూలు చేసిన రూ.65.65 కోట్ల కలెక్షన్ల రికార్డును అధిగమించింది. ఓవర్సీస్ రేసులో బాహుబలి2, దంగల్ చిత్రాల జోరు పోటాపోటీగా కొనసాగుతున్నది.

చైనాలో బాహుబలి1కి చుక్కెదురు

చైనాలో బాహుబలి1కి చుక్కెదురు

గతంలో బాహుబలి ది బిగినింగ్ సినిమా విడుదలైనప్పుడు భారీ కలెక్షన్లను రాబట్టలేకపోయింది. అప్పట్లో బాహుబలి1 తొలి వారాంతానికి 4.5 మిలియన్ యాన్స్‌ను మాత్రమే వసూలు చేసింది. కానీ దంగల్ మాత్రం 80.56 మిలియన్ యాన్లను వసూళు చేయడం రికార్డుగా పేర్కొంటున్నారు.

త్వరలోనే చైనాలో బాహుబలి2

త్వరలోనే చైనాలో బాహుబలి2

త్వరలోనే బాహుబలి2 సినిమాను చైనాలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి1 సినిమాను చూసిన చైనా ప్రేక్షకులు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారనే ప్రశ్నకు సమాధానం కోసం బాహుబలి2 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ బాహుబలి2 విడుదలైతే చైనాలో ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో వేచిచూడాల్సిందే. చైనాలో బాహుబలి1 నిర్మాతలకు చేదు అనుభవాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.

English summary
Baahubali 2 came and conquered the box office, smashing all existing records to create history. SS Rajamouli's magnum opus has earned over Rs 1000 crore within 10 days, leaving everyone in awe. But Aamir Khan's Dangal is not giving up without a fight. The wrestling drama has a fresh lease of life, thanks to its release in China last Friday, and with its fantastic opening weekend, Aamir's film is inching towards the Rs 1000 crore mark.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu