»   » టాప్ 5 లిస్ట్ ఇదీ... 'బ్రూస్ లీ' ఇందులోకి చేరుతుందా?

టాప్ 5 లిస్ట్ ఇదీ... 'బ్రూస్ లీ' ఇందులోకి చేరుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ తాజా చిత్రం బ్రూస్ లీ - ది ఫైటర్ ...అక్టోబర్ 16న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం కలెక్షన్స్ ఏ మేరకు ఇప్పుడున్న రికార్డ్ లను బ్రద్దలు కొట్టబోతున్నాయనేది ఆసక్తికరమైన చర్చగా అయ్యింది. ముఖ్యంగా టాప్ 5 లో రికార్డుని బ్రద్దలు కొడుతుందాలేదా లేదా అని ఇప్పుుడు విషయంగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ మిగతా టాప్ 5 ఏమిటి...అనేది క్రింద స్లైడ్ షోలో చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


బాహుబలి వచ్చిన తర్వాత మరీ కలెక్షన్స్ ,రికార్డులు విషయమై అభిమానులు చాలా కన్సర్న్ గా ఉన్నారు. శ్రీమంతుడు తరహాలో స్టామినాతో భాక్సాఫీస్ వద్ద కాసులు గల గలలు వినపడితే బాహుబలికి పోటీ అవుతుంది. ముఖ్యంగా బ్రూస్ లీ చిత్రం 2200 ధియోటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.


అంతేకాకుండా చిరంజీవి ఈ చిత్రం లో గెస్ట్ గా కనపడటం కూడా సినిమాపై హెప్ కు కారణం అయ్యింది. ట్రేడ్ ఎస్టిమేట్స్ ప్రకారం...రామ్ చరణ్ చిత్రం టాప్ 5లో నిలబడుతుంది అంటున్నారు. ఇది భాక్సాఫీస్ వద్ద మెగా పవర్ స్టార్ పొటిన్షియల్ ఏమిటనేది తేల్చే చిత్రం కాబోతోంది. అలాగే బ్రూస్ లీకి పెంచిన టిక్కెట్ రేట్లు కూడా ప్లస్ కానున్నాయి. ఫ్యాన్ క్లబ్ లలో ఈ నేపధ్యంలో అనేక చర్చలు ఈ టాప్ 5 విషయమై జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇండస్ట్రీలో హిట్స్ గా నిలిచిన చిత్రాల కలెక్షన్స్ చూద్దాం...


స్లైడ్ షోలో టాప్ 5 చిత్రాల కలెక్షన్స్ చూద్దాం...


బాహుబలి

బాహుబలి

బాహుబలి తెలుగు వెర్షన్...186 కోట్లు ప్రపంచవ్యాప్తంగా కలెక్టు చేసి, ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా మొదటి ప్లేస్ లో నిలించింది


శ్రీమంతుడు

శ్రీమంతుడు

శ్రీమంతుడు చిత్రం 81 కోట్లు తో బాహుబలి తర్వాత రెండవ ప్లేస్ లో నిలబడింది.


అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

పవన్ ..అత్తారింటికి దారేది చిత్రం 74 కోట్లుతో మూడవ ప్లేస్ లో నిలబడింది.


మగధీర

మగధీర

మగధీర చిత్రం 71 కోట్లు తో నాలుగువ ప్లేస్ లో నిలబడింది.


గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్

పవన్ కళ్యాణ్ ...61 కోట్లు కలెక్టు చేసి ఐదవ ప్లేస్ లో నిలబడింది.


బ్రూస్ లీ

బ్రూస్ లీ

ఇప్పుడు బ్రూస్ లీ చిత్రం పై అందరి కళ్ళూ ఉన్నాయి. టాప్ 5 లో ఒకటిగా ఇది స్దానం సంపాదిస్తుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.


English summary
According to the trade estimates, Ram Charan-Sreenu Vaitla's Bruce Lee must atleast enter the list of top 5 Telugu movies, to actually prove the Megapower Star's box office potential. Increased ticket rates also adds as a bonus for the probable records of Bruce Lee. In this scenario, there are several discussions going on among fan clubs as in which film from current Top 5 looses its place for Bruce Lee. On that note, Check out the list of current all time top 5 industry hits of Telugu movies and their collections, in the slides below.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu