వరల్డ్ ఫేమస్ లవర్ 3 డేస్ కలెక్షన్స్: పరిస్థితి చూస్తుంటే..

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్'. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టడం లేదని తాజా రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. విజయ్ దేవరకొండ రేంజ్‌ వసూళ్లు రావడం లేదని స్పష్టమవుతోంది. 3 రోజుల్లో ఈ సినిమా వసూళ్ల వివరాలు చూస్తే..

 మరింత క్లిష్టంగా పరిస్థితి.. మూడో రోజు వచ్చేసరికి

మరింత క్లిష్టంగా పరిస్థితి.. మూడో రోజు వచ్చేసరికి

విడుదలైన తొలిరోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీ రెండో రోజుకు చేరుకునే సరికి కాస్త డీలా పడింది. మూడో రోజు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ మనోడి వసూళ్లలో ఏ మాత్రం పరిణితి కనిపించలేదు. రెండు రోజుల్లో 7.5 కోట్ల రేంజ్ షేర్ మాత్రమే వసూలు చేసి.. మూడో రోజుకి వచ్చేసరికి పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

రెండో రోజుతో పోల్చితే మూడో రోజు

రెండో రోజుతో పోల్చితే మూడో రోజు

మూడో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు రెండో రోజుతో పోల్చితే 30% కి పైగా డ్రాప్స్ జరిగాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అయినా గ్రోత్‌ని సాధిస్తుంది అనుకుంటే అది కూడా కనిపించలేదు. కేవలం ఫస్ట్ షో మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించినా, నైట్ షో వరకు మళ్ళీ కలెక్షన్ డ్రాప్స్ కనిపించాయి.

మూడో రోజు షేర్ ఎంతంటే..

మూడో రోజు షేర్ ఎంతంటే..

రెండో రోజు 2.8 కోట్ల నుండి 3 కోట్ల షేర్ వసూలు చేసిన వరల్డ్ ఫేమస్ లవర్.. మూడో రోజు 1.2 కోట్ల రేంజ్ షేర్ రాబట్టింది. సెలవు దినం కూడా ఇలా కలెక్షన్స్ డ్రాప్ కావడం సినిమా డిసాస్టర్‌కి అద్దం పడుతోంది. సో ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఈ సినిమా హిట్ అనిపించుకోవడం కష్టం అని తెలుస్తోంది.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఓకే.. ఇప్పుడు చూస్తే

ప్రీ రిలీజ్ బిజినెస్ ఓకే.. ఇప్పుడు చూస్తే

విజయ్ దేవరకొండ చిత్రానికి యూత్‌లో ఎనలేని క్రేజ్ ఉంటుంది. దానికి తగ్గట్టే విజయ్ చిత్రాలకు మంచి బిజినెస్ వస్తుంది. ఇదే బాటలో వరల్డ్ ఫేమస్ లవర్ కూడా భారీ రేటుకు అమ్ముడయింది. కానీ విడుదల తర్వాత 'వరల్డ్ ఫేమస్ లవర్' కలెక్షన్స్ ఊరట కలిగించడం లేదు.

Recommended Video

World Famous Lover Review And Rating | Filmibeat Telugu
బ్రేక్ ఈవెన్ దాటాలంటే..

బ్రేక్ ఈవెన్ దాటాలంటే..

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర హక్కులు దాదాపు 23 కోట్లకు సేల్ అయ్యాయి. నైజాంలో రూ.9 కోట్లు, సీడెడ్‌లో రూ.4 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగేతర రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.5 కోట్లతో మొత్తంగా 30 కోట్లకుపైగా బిజినెస్ నమోదు చేసింది. సో ఈ మార్క్ దాటాలంటే మనోడు చాలా స్పీడ్ కావాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X