»   » మహేష్ '1-నేనొక్కడినే' రిలీజ్ ఫోస్ట్ ఫోన్?!

మహేష్ '1-నేనొక్కడినే' రిలీజ్ ఫోస్ట్ ఫోన్?!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం '1-నేనొక్కడినే' . ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల చేయటానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు థియోటర్స్ బుక్ చేసేసారు. అయితే తాజా సమాచారం ప్రకారం...మరో రెండు రోజులు లేటుగా జనవరి 13 న భోగి రోజున విడుదల చేస్తానని చేసే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం ఆడియో రీసెంట్ గా విడుదలైంది. ఈ ఆడియో ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తోంది.


ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న ఈ చిత్రం రన్ టైం 2 గంటల ఇరవై నిముషాలు అని తెలుస్తోంది. ఎక్కడా లాగ్ లేకుండా బోర్ కొట్టకుండా ఉండటం కోసం,రన్ టైం ని చాలా క్రిస్ప్ గా కట్ చేసి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'జనవరి 10న '1'ని తెచ్చేస్తున్నాం' అని మహేష్‌ కూడా చెప్పేశాడు. మహేష్‌కి సంక్రాంతి సీజన్‌ బాగా కలిసొచ్చింది 'ఒక్కడు', 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మ వాకిట్లో' ముగ్గుల పండక్కి విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు '1' కూడా పండగ బరిలో దిగబోతోంది.

1 Nenokkadine

అలాగే ఈ చిత్రంలో కృతిసనన్‌ ఓ టీవీలో న్యూస్‌ రీడర్‌గా పని చేస్తోంది. ఇందుకోసం ఆమె ఏవో వార్తలు చదువటాన్ని మొన్నా మధ్య రామోజీఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూట్ చేసారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇక్కడ అందుకు సంబంధించిన సీన్లతో పాటు యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు చిత్రీకరించారు.

డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
Mahesh Babu's 1 Nenokkadine shoot is almost complete. 1 Nenokkadine team is trying their best to release the movie on January 10th as it is the ideal date. But if the film doesn't get ready by then, it will release on Bhogi day, i.e. January 13th. Although this is a good day to release, it will affect the film's openings in US. Mahesh Babu is the biggest crowd puller in US and if he misses the weekend release then 1 Nenokkadine will be in trouble.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu