twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ క్లైమాక్స్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త

    By Srikanya
    |

    హైదరాబాద్ : అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కి విడుదలకు సిద్దమవుతున్న సినిమా ‘సన్నాఫ్‌ సత్యమూర్తి'. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయిటకు వచ్చింది. చిత్రంలో 25 నిముషాల క్లైమాక్స్ ఉండబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్ సినిమాలో హైలెట్ అని చెప్తున్నారు. ఫస్టాఫ్ ...ఫన్ తో గడిచిపోయి..ఇంటర్వెల్ కు సీరియస్ మోడ్ లోకి వెళ్లినా..సెకండాఫ్ మాత్రం కొత్త మలుపులతో సాగుతుందంటున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    పూర్తిగా వన్ లైనర్స్ తో ఈ క్లైమాక్స్ సాగుతుందని, హై ఎమోషనల్ సెటప్ లో చాలా ఇంటెన్స్ గా ఈ క్లైమాక్స్ ఉండబోతోందని చెప్పుకుంటున్నారు.ఇదే ఎపిసోడ్ లోనే యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుందని, అది మైండ్ బ్లోయింగ్ అని ఫిల్మ్ నగర్ వర్గాల సమచారం. అత్తారింటికి దారేది తరహాలో ఈ క్లైమాక్స్ ...ఫ్యామిలీ ప్రేక్షకులను పదే పదే థియోటర్స్ కు రప్పిస్తుందని అంచనా వేస్తున్నారు.

    నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ ‘‘బన్ని, త్రివిక్రమ్‌ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు తెరకెక్కించారు. అల్లు అర్జున్‌ పెర్‌ఫార్మెన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సమంత, నిత్యామీనన్‌, అదాశర్మ తమ అందచందాలు, అభినయంతో ఆకట్టుకుంటారు.

    25 Min Climax for Allu Arjun's 'S/O Satyamurthy'

    ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే భారీగా ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని తెలిపారు.
    ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ''జులాయి' కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమిది. ఆ సినిమా ఘన విజయం సాధించింది. 'సన్నాఫ్‌ సత్యమూర్తి' దానికి నాలుగు రెట్లు విజయం సాధిస్తుంది''అన్నారు.

    సమంత చెబుతూ ''ఒక అందమైన కుటుంబ కథా చిత్రమిది. అల్లు అర్జున్‌తో తొలిసారి నటించాను. హార్డ్‌వర్క్‌ అనే పదానికి నిర్వచనం ఆయన'' అంది. ఉపేంద్ర మాట్లాడుతూ ''చాలా కాలం తరవాత మళ్లీ తెలుగులో నటించా. చాలా మంచి పాత్ర దక్కింది. బన్నీ సినిమాలన్నీ చూస్తూ ఉంటా. తనదైన స్త్టెల్‌తో దక్షిణాదిన మంచి పేరు తెచ్చుకొన్నాడ''న్నారు.

    ''నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో ఓ మంచి సినిమా తీశాం. అడగ్గానే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకొన్న ఉపేంద్రగారికి ధన్యవాదాలు'' అన్నారు త్రివిక్రమ్‌.

    అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. కంటెంట్‌ ఉన్నవాడికి కటౌట్‌తో పనిలేదు.. అని హరీష్‌ శంకర్‌ ఓ డైలాగ్‌ రాశాడు. త్రివిక్రమ్‌ గారిని చూస్తే అదే గుర్తొస్తుంది. మేటర్‌ ఉన్నవాడికి మ్యాజిక్‌తో పని లేదు. ఈ సినిమాలోనూ మంచి సంభాషణలున్నాయ''న్నారు.

    సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

    English summary
    'S/O Satyamurthy' will have a 25 Minutes Climax Block highly emotional set-up and an intense action sequence will follow.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X