»   »  ‘అ ఆ’: త్రివిక్రమ్ రెమ్యునేషన్ ఎంత? హీరో కన్నా ఎక్కువా?

‘అ ఆ’: త్రివిక్రమ్ రెమ్యునేషన్ ఎంత? హీరో కన్నా ఎక్కువా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్, సమంతలు జంటగా రూపొందిన చిత్రం 'అ ఆ'. త్రివిక్రమ్ సన్నిహితుడు రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాధాకృష్ణ బ్యానర్ లో త్రివిక్రమ్ వరుసగా మూడు సినిమాలు చేశాడు. అ..ఆ చిత్రం టాక్ కు సంభంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నిమిత్తం ఎంత త్రివిక్రమ్ కు రెమ్యునేషన్ గా ఇచ్చి ఉంటారనే టాపిక్ సినిమా సర్కిల్స్ లో మెదలైంది.

అయితే అందుతున్న సమచారం ప్రకారం ఈ సినిమాకు త్రివిక్రమ్ అక్షరాల 15 కోట్ల డబ్బును రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అది నితిన్ ఈ చిత్రం నిమిత్తం తీసుకున్న రెమ్యునేషన్ కన్నా ఎక్కువే అని తెలుస్తోంది.

త్రివిక్రమ్ స్థాయికి ఆ మాత్రం ముట్టజెప్పడం సబబే అని నిర్మాత భావించే ఇచ్చాడంటున్నారు. అలాగే 'అ ఆ' సినిమా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టి, ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతుందంటే దానికి కారణం త్రివిక్రమే అని నిర్మాత ఆనందంగా ఉన్నారట. అందుకే రాధాకృష్ణ తన తదుపరి ప్రాజెక్ట్ కూడా త్రివిక్రమ్ తో చేయడానికే మక్కువ చూపిస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం అలాంటిదని, ఈ సినిమా కోసం ఇప్పటివరకు త్రివిక్రమ్ కు గానీ, నితిన్ కు గానీ ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వలేదని, మా మధ్య ఉన్న అనుబంధాన్ని డబ్బుతో పోల్చద్దని మీడియా ముందు చెప్పాడు.

A aa: Trivikram's Remuneration 15 cr?

'అ..ఆ' చిత్రం జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజు దాదాపు రూ.5 నుంచి 6 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. అలాగే..నాలుగు రోజులు కలెక్షన్స్ పూర్తయ్యేసరికి దాదాపు ఎనభై శాతం వరకూ రికవరీ అయ్యిందని తెలుస్తోంది.

మరోవైపు ఓవర్సీస్ లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఓవర్సీస్ లో చిత్ర కలెక్షన్లు హాఫ్ మిలియన్ మార్క్ కు చేరువగా ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. త్రివిక్రమ్ డైలాగ్స్, నదియ, రావు రమేష్, నరేష్ ల నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హరికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం పై రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంత హీరోయిన్ గా తొలిసారిగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా ' అనుపమ పరమేశ్వరన్'(మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఫేం) నటిస్తున్నారు. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ,అనన్య,ఈస్వరీరావు,సన, గిరిబాబు, నరేష్,రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి లు నటిస్తున్నారు.

English summary
Sources close to A aa unit have informed us that Trivikram's remuneration for this film close to 15 crores. This is the highest remuneration for any Telugu director till date and in fact, much more than the lead actor in that film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu