OG : పవన్ కళ్యాణ్ చేతిపై టాటూ.. మీనింగ్ తెలిస్తే పూనకాలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పెండింగ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ శాసన సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న సంగతి విధితమే. ఇక అక్కడ పాలనపరమైన బాధ్యతలు చక్కదిద్దిన తర్వాత కాస్తా సమయం తీసుకుని తను సైన్ చేసిన చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వచ్చారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పెండింగ్ చిత్రాల్లోని అన్ని సినిమాలకు సంబంధించి షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నారు.

జూలై 24న పిరీయాడికల్ యాక్షన్ ఫిల్మ్ హరి హర వీరమల్లు : పార్ట్ 1 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా ఆశించిన మేర ఫలితాన్ని అందించలేదు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న OG చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సాహో దర్శకుడు సుజీత్ OG చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రం నుంచి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ అందుతూనే వస్తోంది.

A Tattoo on Pawan Kalyan Hand

ఇప్పటికే సినిమా పోస్టర్లు, గ్లింప్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ దక్కింది. ఇక ఇటీవల విడుదలైన OG చిత్రం మొదటి పాట Fire Storm విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. OG థీమ్ సాంగ్ గా సాగిన పాట లిరిక్స్, థమన్ అందించిన క్యాచీ ట్యూన్ మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం మేకర్స్ 2వ పాటను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో పాట టైటిట్, విడుదల తేదీ సమయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ చర్చగా మారింది.

2వ పాటకు సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్, హీరోయిన్ ప్రియాంక రొమాంటిక్ స్టిల్ ను విడుదల చేశారు. దీపాల కాంతుల్లో ఇద్దరూ వెలిగిపోతున్నారు. అయితే ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ కుడి చేయిపై జపాన్ భాషల్లో మూడు పదాలు టాటూ రూపంలో ఉన్నాయి. దీంతో వాటి అర్థం ఏంటని అభిమానులు శోధిస్తున్నారు. కాగా మొదటి అక్షరం అర్థం ఇంగ్లీస్ లో ప్రామీస్, రెండో అక్షరం అర్థం బలం, మూడో అక్షరం ఫైర్ అర్థం అని తెలుస్తోంది.

మూడు పదాలను ఓజాస్ పచ్చబొట్టు వేయించుకోవడానికి కారణం ఏంటనేది పక్కన పెడితే.. ఆ పవర్ ఫుల్ వర్డ్స్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ ఇంకెంత సెన్సేషన్ గా ఉండబోతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రంలో విలన్ గా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. సీనియర్ నటి శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రాన్ని థమన్ ఎస్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇక సెప్టెంబర్ 25, 2025న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్నారు.

More from Filmibeat

Read more about: og movie pawan kalyan sujeeth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X