»   » ఆమ్‌ఆద్మీ పార్టీ లోకి ఈ స్టార్స్ అంతా...

ఆమ్‌ఆద్మీ పార్టీ లోకి ఈ స్టార్స్ అంతా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన అనంతరం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ దఫా సామాన్యులతో పాటు బాలీవుడ్‌ నటులకు కూడా పార్టీ అభ్యర్థిత్వాలను కట్టబెట్టాలని యోచిస్తోంది. ప్రీతిజింటా, అనుపమ్‌ ఖేర్‌, షబానా అజ్మీ పేర్లు ముందు వరసలో ఉన్నాయి. మరాఠీ నటులతోనూ ఆప్‌ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.

సంగీత దర్శకుడు విశాల్‌ ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ తరఫున ప్రచారం చేశారు. దీంతో ఆయనకూ టికెట్టు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌ నటులు.. నందితా దాస్‌, కొంకణాసేన్‌ శర్మ, మరాఠీ నటులు అతుల్‌ కుల్‌కర్ణి, సోనాలీ కుల్‌కర్ణి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన నటీనటులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

Aam Aadmi Party eyes Bollywood support

ముంబయి బరిలో నిలవాలని షబానా అజ్మీకి సూచించినట్లు తెలిసింది. అయితే తాను ప్రియాదత్‌పై పోటీ చేయబోనని కరాఖండీగా చెప్పినట్లు సమాచారం. అనుపమ్‌ ఖేర్‌కు హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా నియోజకవర్గం కేటాయించనున్నట్లు తెలిసింది. ఇక ప్రీతిజింటాను ఢిల్లీ నుంచి బరిలో దింపాలని నేతలు భావిస్తున్నారు. నీతివంతమైన పాలన, నీతి వంతమైన రాజకీయాలే లక్ష్యంగా మాజీ ఐఏఎస్ అధికారి కేజ్రీవాల్ నెలకొల్పిన 'ఆమ్ ఆద్మీ పార్టీ' ఢిల్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మరో ప్రక్క ఆంధ్రప్రదేశ్‌లో 'ఆమ్ ఆద్మీ పార్టీ' అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ పగ్గాలు చేపడితే ఎలా ఉంటుంది? అనే అంశంపై అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తరించాల్సిన అవసరం ఉందని, పవన్ కళ్యాణ్ దానికి నేతృత్వం వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పవన్ అభిమానులు ఈ అంశాన్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ సోషల్ నెట్వర్కింగులో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది అభిమానులు 'ఆమ్ ఆద్మీ పార్టీ' పగ్గాలు ఏపీలో పవన్ కళ్యాణ్ చేపడితే బాగుంటుందని, ఇదే ఆయన రాజకీయ ఎంట్రీకి పర్ ఫెక్ట్ టైం అని కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

English summary
Just one year old and AAP (Aam Aadmi Party) headed by Arvind Kejriwal took the latest polling with storm. They uprooted age old congress establishment in Delhi with high margin and emerged as a winner of 2013 assembly poll. Bollywood is awe of Arvind Kejrial and back AAP.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu