అఖిల్ పై ట్రెయిల్ షూట్ చేస్తున్న దర్శకుడు?

By Srikanya

About Akil's Entry trail shoot
హైదరాబాద్ : అక్కినేని అఖిల్ అరంగేట్రం ఎప్పుడాఎప్పుడా అని తెలుగు చిత్ర పరిశ్రమతోపాటుగా అక్కినేని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. సరైన కథ దొరికితే అఖిల్ ఎంట్రీ ఖాయమేనని నాగార్జున ఓసారి చెప్పారు. ఇప్పటివరకూ అఖిల్‌కోసం నాగార్జున విన్న కథలు ఏవీ ఆయనకు నచ్చలేదని ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే పూణె ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ నుండి వచ్చిన ఓ కుర్రాడు అఖిల్‌ చెప్పిన కథ నచ్చిందని వార్త ప్రచారంలోకి వచ్చింది.

ఇక ఇంతకుముందు అమీర్‌ఖాన్‌కు కథ వినిపించిన పూణె కుర్రాడు అఖిల్‌తో కూడా ఓ చిత్రం చేయాలని టాలీవుడ్‌కు వచ్చారట. అఖిల్ ను తన చిత్రంలో వారియర్‌గా చూపే ప్రయత్నం చేస్తున్నాడని, ఇందుకోసం 7 విభిన్నమైన గెటప్స్‌లో ట్రయిల్‌షూట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

యోధుడు కథ అంటేనే భారీ వ్యయం తప్పదు కనుక అంత పెట్టుబడి ఎవరు పెడతారు, అన్నపూర్ణ బ్యానర్ పైనే చేస్తారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే ట్రయిల్ షూట్ పూర్తిచేస్తారని సమాచారం ట్రయిల్ షూట్ సక్సెస్ అయితే అఖిల్ ఎంట్రీ త్వరలో జరుగుతుందని అంటున్నారు.

అఖిల్ మాట్లాడుతూ... "నేను ఇప్పటిదాకా ఎటువంటి సినిమాను అంగీకరించలేదు. నా మొదటి సినిమాకు సిద్ధపడుతున్నాను" అని తెలిపాడు. ఇప్పటికే రాజమౌళి కుమారుడు కార్తీక్... అఖిల్ తో ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. మాటీవీ షార్ట్ ఫిలింస్ కంటెస్ట్ లో ఆ షార్ట్ ఫిలిం ప్రదర్శిస్తారని చెప్పుకుంటున్నారు. నాగచైతన్య ఎంట్రీ విషయంలో నాగార్జున అంచనాలు తారుమారయ్యాయి. చైతన్య తొలి చిత్రం'జోష్' అపజయాన్ని మూటగట్టుకుంది. ఈనేపథ్యంలో అఖిల్ విషయంలో అలా జరుగకూడదని నాగార్జున భావిస్తున్నారు.

ఇక మరో దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా అఖిల్ తో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ... "అక్కినేని అఖిల్‌తో నా సినిమా ఉండొచ్చు. కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడే అఖిల్‌తో నేను సినిమా చేయబోతున్నానన్న వార్త రూమరే. అయినా ముందు కథ దొరకాలి కదా. తనకు ఇప్పటికే ఓ స్టార్ సన్‌గా, క్రికెటర్‌గా ఓ క్రేజ్ ఉంది. చేస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే సినిమా చేయాలి. తను ఆల్రెడీ క్రికెట్‌తో స్టార్ అయ్యాడు అన్నారు శేఖర్ కమ్ముల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X