For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వల్గర్ కామెడీ షోలో నేనా? డబ్బుకు కక్కుర్తి పడకుండా.. నిర్వాహకులకు జయసుధ షాక్

  |
  Jayasudha Rejects Comedy Show Offer || Filmibeat Telugu

  తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఓ క్రేజీ కామెడీ షోగా పాపులారిటీ సంపాదించుకొన్నది. ప్రముఖ నటుడు నాగబాబు, హీరోయిన్, పొలిటిషియన్ రోజా ఆ కార్యక్రమాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే అత్యంత రేటింగ్ ఉన్న కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు సినీ తెరకు పరిచయం అయ్యారు. మరికొందరికి జీవనోపాధిగా మారింది. అలాంటి షో కోసం హెస్ట్‌గా ఉండమని జయసుధను సంప్రదిస్తే.. అందుకు ఆమె నిరాకరించిందంట.. వివరాల్లోకి వెళితే

  యాక్టర్ రోజా స్థానంలో జయసుధ

  యాక్టర్ రోజా స్థానంలో జయసుధ

  నాగబాబు, రోజా, రష్మీ, అనసూయ లాంటి హోస్ట్స్ జబర్దస్త్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన సంగతి తెలిసిందే. అయితే జనసేన తరఫున నాగబాబు ఎంపీగా పోటీచేయడం, వైసీపీ తరఫున రోజా ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో వారి స్థానాల కోసం పాపులారిటీ ఉన్న నటులను సంప్రదించారట. అందులో భాగంగానే జయసుధను హెస్ట్‌గా వ్యవహరించాలని కోరితే అందుకు ఆమె తిరస్కరించదని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ కథనాన్ని వెల్లడించింది.

  ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువగా

  ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువగా

  వాస్తవానికి జయసుధ హీరోయిన్‌గా కుటుంబ ప్రేక్షకులు మెచ్చే పాత్రల్లో నటించి సహజనటిగా మెప్పు పొందారు. హీరోయిన్ పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి తర్వాత సున్నితమైన, కుటుంబ విలువలు ఉన్న పాత్రల్లో మెరుస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వల్గర్ కామెడీ తనకు సూట్ కాదని జయసుధ సున్నితంగా నిరాకరించినట్టు కథనంలో పేర్కొన్నారు.

  అత్యంత టీఆర్పీతో

  అత్యంత టీఆర్పీతో

  అత్యంత టీఆర్పీ ఉన్న కార్యక్రమాన్ని జయసుధ తిరస్కరించి మంచి పనే చేశారు. ఆమెకు ఆ పాత్ర సూట్ కాదు. కొన్నిసార్లు కామెడీ షో చూస్తుంటే కుటుంబ సభ్యులే ఇబ్బంది పడే విధంగా సెటైర్లు ఉంటాయి. వాటిని జయసుధ విని తట్టుకోగలదా అనే మాట సినీ వర్గాల్లో వినిపించింది. కామెడీ షోకు జడ్జీగా వ్యవహరిస్తే భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినా అందుకు నిరాకరించడం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిసున్నాయి.

  శేఖర్ మాస్టర్, మీనా హోస్ట్‌గా

  శేఖర్ మాస్టర్, మీనా హోస్ట్‌గా

  ప్రస్తుతం క్రేజీ కామెడీ షోలో శేఖర్ మాస్టర్, నటి మీనా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నాగబాబు, రోజా స్థానాలను వారితో భర్తీ చేశారు. వీరిద్దరూ ఈ షోను ఎలా ముందుకు తీసుకెళ్తారోనని ఆసక్తి నెలకొని ఉంది. నాగబాబు, రోజా సమయస్ఫూర్తిని వీరు ఎలా పట్టుకొంటారో అనే క్యూరియాసిటీ మాత్రం పెరుతున్నది.

  కామెడీ షోపై విమర్శల వెల్లువ

  కామెడీ షోపై విమర్శల వెల్లువ

  తెలుగులో నంబర్‌వన్ టెలివిజన్‌ ఛానెళ్లలో ఒకటిగా ప్రసారమయ్యే ఈ కామెడీ షోపై ఇటీవల కాలంలో విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలను కించపరిచే విధంగా సన్నివేశాలు, డైలాగ్స్‌తో ఇబ్బందికరంగా తయారైందనే మాట, ఫిర్యాదులు వినిపించాయి. అయినప్పటీకి, విమర్శలు తట్టుకొని నెంబర్ వన్ కామెడీ షోగా నిలబడటం విశేషమే అని చెప్పుకోవాలనే మాట కూడా వినోద పరిశ్రమలో వినిపిస్తున్నది.

  English summary
  As per Deccan Chronicle report, Jabardast comedy show happens to be one of the most popular Telugu TV shows. However, actor-turned-politicians Naga Babu and Roja, who have hosted the show for many years, seem to be caught up in political affairs and therefore, its organisers have been looking for celebrities who can replace them. According to a source, the first one to be approached for the position of the show’s judge was yesteryear actress Jayasudha. However, she turned down the offer.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more