»   » గాలి కబురా...నిజమా..నితిన్ చెప్పాలి

గాలి కబురా...నిజమా..నితిన్ చెప్పాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్కినేని అఖిల్, ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటిగ్ రెగ్యులర్ గా హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో నిఖిల్ గెస్ట్ గా చేసే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు. వినాయిక్, నిఖిల్ కాంబినేషన్ లో గతంలో దిల్ చిత్రం వచ్చి హిట్టైంది. ఇప్పుడు మళ్లీ నితిన్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ నేపధ్యంలో ఓ చిన్న కీలకమైన పాత్రను నితిన్ కోసం డిజైన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇది గాలి కబురా నిజమా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. లేదా నితిన్ చెప్పాలి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరో ప్రక్క ఈ చిత్రానికి అందుతున్న సమాచారం ప్రకారం ‘మిస్సైల్ ' అనే టైటిల్ ని ఖరారు చేసే అవకాసం ఉందని సమాచారం. కథ ప్రకారం ఈ టైటిల్ అయితే ఫెరఫెక్ట్ గా ఏప్ట్ అవుతుందని భావిస్తున్నారని, ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని చెప్పుకుంటున్నారు. దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Actor Nithin’s cameo in Akhil’s Missile?

అఖిల్‌ సరసన సాయేషా సైగల్‌ నటిస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకుడు. ఈ చిత్రంలో అఖిల్‌ తండ్రి పాత్ర కోసం రాజేంద్రప్రసాద్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రం మేజర్ పార్ట్ అడవి నేపధ్యంలో జరుగుతుందని తెలుస్తోంది. దాంతో చిత్రంలోని కొన్ని కీ సీన్స్...సౌత్ ఆఫ్రికా అడవులలో షూటింగ్ జరుగనుందని సమాచారం. మిగతా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో లో జరగుతుందని వినికిడి.

వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటివలే కంప్లీట్ అయ్యింది. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాలలో హీరో అఖిల్ పై ఇంట్రడక్షన్ ఫైట్ చిత్రీకరించారు.

‘ఫస్ట్ షెడ్యూల్ వాజ్ అమైజింగ్ ఎక్స్ పీరియన్స్. అదిరిపోయే ఇంట్రడక్షన్ ఫైట్ తీసిన స్టంట్ మాస్టర్ రవి వర్మకు థాంక్స్ చెప్పాల్సిందే. సం అమైజింగ్ ఫుటేజ్.' అని అఖిల్ ట్వీట్ చేశారు.

Actor Nithin’s cameo in Akhil’s Missile?

అఖిల్ సరసన సాయేష సైగల్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ అందించగా కోన వెంకట్ మాటలు రాస్తున్నారు. శ్రేష్ఠ మూవీస్ పతాకంపై తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలసి యువహీరో నితిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్, అనూప్ రూబెన్స్ సంగీత దర్శకులు. ఈ సినిమాపై అక్కినేని అభిమానులలో అంచనాలు బాగున్నాయి.

వివి వినాయిక్ మాట్లాడుతూ...''నాగార్జునగారు నాపై పెట్టుకున్న నమ్మకమే ఈ సినిమా. 'మనం'లో అఖిల్‌ను చూడగానే అందరిలా నేనూ షాక్‌కు గురయ్యా. అంత బాగా నచ్చేశాడు. ఎంత నచ్చాడో ఈ చిత్రంలో చూపిస్తాను.వంద శాతం కష్టపడే సాంకేతిక బృందం కుదిరింది. ప్రతి ప్రేక్షకుడికీ నచ్చేలా అఖిల్‌ను తెరపై చూపిస్తానని మాటిస్తున్నాను''అన్నారు వి.వి.వినాయక్‌.

వెంకటేష్‌ మాట్లాడుతూ... ''అఖిల్‌ రూపంలో ఒక కొత్త స్టార్‌ రాబోతున్నాడు. ఇక అక్కినేని అభిమానులకు పండగే. అఖిల్‌ ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తాడు. వినాయక్‌ దర్శకత్వంలో తెరంగేట్రం అవ్వడం ఆనందంగా ఉంది''అన్నారు.

Actor Nithin’s cameo in Akhil’s Missile?

కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ... ''విక్టరీ మధుసూదనరావుగారి చేతుల మీదుగా తెరకు పరిచయమయ్యారు నాగార్జున. ఒక 'వి' ఉన్న దర్శకుడి చేతులమీదుగా పరిచయమైన నాగార్జున మంచి పేరు తెచ్చుకొన్నాడు. మూడు 'వి'లు ఉన్న వినాయక్‌ చేతులమీదుగా పరిచయమవుతున్న అఖిల్‌ మరింత పేరు తెచ్చుకొంటాడు''అన్నారు.

నాగచైతన్య మాట్లాడుతూ... ''ఈ రోజు కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నా. సినిమా అంటే అఖిల్‌కు ప్రాణం. తాను చేసే ప్రతి సినిమా ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుందన్న నమ్మకముంది. దేశంలోని సినిమా అభిమానులందరినీ ఆకట్టుకొంటాడన్న నమ్మకముంది''అన్నారు.

నితిన్‌ మాట్లాడుతూ... ''ప్రతిష్ఠాత్మకమైన ఈ సినిమాకు నేను నిర్మాత కావడం ఆనందంగా ఉంది. నాగార్జునగారు మాపై పెట్టుకొన్న నమ్మకాన్ని నెరవేర్చుతాం. ఆయన చేసిన ప్రేమకథా చిత్రాలు 'గీతాంజలి', 'నిన్నే పెళ్లాడతా'.. మాస్‌ సినిమాలు 'శివ', 'మాస్‌' కలిపితే ఎలా ఉంటుందో అఖిల్‌ చేసే ఈ సినిమా అలా ఉంటుంది''అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ...''అఖిల్‌ను 'మనం' రూపంలో నాన్న ఆశీర్వదించారు. అఖిల్‌కు సూపర్‌ హిట్‌ సినిమా ఇస్తామని వినాయక్‌, నితిన్‌ మాటిచ్చారు. ఈ కథ నేనూ విన్నాను. చాలామంది ఇదొక ప్రేమకథ అనుకొంటున్నారు. అది నిజం కాదు. సినిమా నిండా మాస్‌ అంశాలు ఉన్నాయి''అన్నారు నాగార్జున.

Actor Nithin’s cameo in Akhil’s Missile?

అమల మాట్లాడుతూ....''అందరిలాగే అఖిల్‌ సినిమా గురించి నేనూ ఎదురు చూస్తున్నా. మా అబ్బాయిని అభిమానుల చేతుల్లో పెడుతున్నాను''అన్నారు.

అఖిల్‌ మాట్లాడుతూ.... ''ఈ సమయంలో తాతగారు ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఆయన అభిమానుల్లోనే దేవుడిని చూసుకొనేవారు. అభిమానులు ఎంతో ఇస్తారు. మేం తిరిగి వాళ్లకు హిట్‌ సినిమా తప్ప ఏం ఇవ్వగలం. ఎలాగైనా హిట్‌ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలనుకొన్నా. దాని గురించే ఆలోచిస్తూ నాన్నను అడిగేవాణ్ని. అప్పుడు చీకట్లో ఉన్న నాకు ఒక సెర్చ్‌లైట్‌లా కనిపించారు వి.వి.వినాయక్‌గారు. ఇలాంటి సినిమాకు వినాయక్‌గారే దర్శకత్వం వహించాలని నాకనిపించింది.

అలాగే...కేవలం అభిమానుల కోసమే తొలి సినిమా చేయాలని నితిన్‌ చెబుతూ ఉండేవాడు. ఆయన నా సినిమాకు నిర్మాత కావడం ఆనందాన్నిచ్చింది. ఇందులో యాక్షన్‌, డ్యాన్స్‌ అన్నీ కొత్తగా ఉంటాయి. మూడు నాలుగేళ్లుగా డ్యాన్స్‌ నేర్చుకుంటున్నా. అందరికీ నచ్చేలా తెరపై కనిపిస్తా. ఈ సినిమాకు తమన్‌, అనూప్‌ రూబెన్స్‌ కలసి సంగీతం అందిస్తారు''అన్నారు.

నేను ఈ స్థాయికి చేరుకోవటానికి అమ్మనాన్నలే ముఖ్య కారణం. అన్నయ్య నాగచైతన్య ఇంత ఎమోషనల్ మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు. భవిష్యత్‌లో మేమిద్దరం కలిసి ఓ పెద్ద మల్టీస్టారర్ సినిమా చేస్తాం అన్నారు అఖిల్.

English summary
Nithin is doing a cameo in Akhil’s Missile. Sayesha Saigal is paired opposite Akhil in this movie. Missile is produced by Nithin under his home banner. SS Thaman and Anup Rubens are scoring the music.
Please Wait while comments are loading...