»   » పవన్ చిత్రంలో వెంకటేశ్ అతిథి పాత్ర.. విక్టరీ మరో ప్రయోగం.. ఆ పాత్రలోనా?

పవన్ చిత్రంలో వెంకటేశ్ అతిథి పాత్ర.. విక్టరీ మరో ప్రయోగం.. ఆ పాత్రలోనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిందీలో ఘన విజయం సాధించిన ఓ మై గాడ్ చిత్రాన్ని తెలుగులో గోపాల గోపాలా చిత్రంగా రీమేక్ చేశారు. అందులో హీరో వెంకటేశ్. ఈ చిత్రంలో కీలక పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించి దుమ్ము రేపాడు. అలా టాలీవుడ్‌లో అరుదైన కాంబినేషన్‌కు తెర లేచింది. వెంకటేశ్ చిత్రంలో గెస్ట్‌ పాత్రలో నటించడానికి పవర్ స్టార్ సిద్ధపడటం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే వారి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల సాధ్యమైందనే విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో వెంకటేశ్, పవన్ క్లోజ్ ఫ్రెండ్స్. తాజాగా తన స్నేహితుడు పవన్ కోసం అతిథి పాత్రలో కనిపించడానికి సిద్ధమయ్యారనే విషయం వెలుగులోకి వచ్చింది.

పవన్‌కు మామగా వెంకీ

పవన్‌కు మామగా వెంకీ

దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర షూటింగ్‌తో ప్రస్తుతం పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం కొద్ది రోజులుగా ఎవరైతే బాగుంటుందనే దర్శక, నిర్మాతలు తెగ ఆలోచించారంట. ఎందుకంటే సినిమాలో కీలకంగా ఉంటే పవన్ మామ పాత్రంట. పవన్‌కు మామగా ఎవరైతే బాగుంటుందనే విషయాన్ని పలువురు పేర్లను పరిశీలించినట్టు తెలిసింది.

శరవేగంగా త్రివిక్రమ్ షూటింగ్

శరవేగంగా త్రివిక్రమ్ షూటింగ్

పవన్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నది. ఈ చిత్ర షూటింగ్‌లో మంగళవారం (జూన్ 20న) వెంకటేశ్ పాల్గొన్నట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ వెంకటేశ్ పాల్గొన్నాడా లేదా షూటింగ్ స్పాట్‌కు వెళ్లాడా అనే విషయంపై క్లారిటీ అయితే లేదు. కానీ ఈ సినిమాలో పవన్‌కు మామగా వెంకటేశ్ నటిస్తున్నాడనే రూమర్ వైరల్‌గా మారింది.

ఇద్దరు భామలతో..

ఇద్దరు భామలతో..

ఇంకా పేరు పెట్టని చిత్రానికి గోపాలకృష్టుడు అనే పేరు ప్రచారంలో ఉన్నది. ఈ చిత్రంలో కీర్తీ సురేశ్, అను ఎమ్మాన్యుయేల్ అనే ఇద్దరు అందాల భామలు పవన్‌తో జోడి కడుతున్నారు. వెంకటేశ్ ఈ ఇద్దరి భామల్లో ఒకరికి తండ్రి లేదా ఇద్దరికి ఫాదరా అనే విషయం చాలా కన్ఫ్యూజ్‌లో ఉంది. అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడిస్తే తప్పా ఈ సందిగ్ధత తొలిగిపోవడం సాధ్యం కాదు.

 సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పవర్ స్టార్

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పవర్ స్టార్

త్రివిక్రమ్ సినిమాలో పవన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు పాత్రను పోషిస్తున్నాడు. ఈ కథా నేపథ్యం దుబాయ్ కేంద్రంగా సాగుతుందట. అయితే దుబాయ్‌లో షూట్ చేయడానికి పవన్ ఇష్టపడకపోవడంతో రామోజీ ఫిలిం సిటీలోనే భారీ సెట్టింగ్ వేసినట్టు వార్తలు వచ్చాయి. పవర్ స్టార్ ఆఫీస్ కోసమే దాదాపు 1.5 కోట్లు ఖర్చు చేశారనేది తాజా సమాచారం.

పవర్ మేకోవర్ స్టన్నింగ్

పవర్ మేకోవర్ స్టన్నింగ్

ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ తన శరీర ఆకృతిని పూర్తిగా మార్చుకొన్నాడనేది నిన్న మీడియాలో వచ్చిన ఫొటోలు స్పష్టం చేశాయి. యంగ్, డైనమిక్‌గా కనిపించడానికి పవర్ స్టార్ బరువు తగ్గాడనేది తెలిసింది. నాజుక్కగా తయారైన పవన్ గెటప్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈ గెటప్‌కు సంబంధించి పవన్ మీసాలు తిప్పి ఉండటం ప్రధాన ఆకర్షణ.

హ్యాట్రిక్ కోసం పవన్, త్రివిక్రమ్

హ్యాట్రిక్ కోసం పవన్, త్రివిక్రమ్

సెన్సేషనల్ కథతో మరో హిట్ కొట్టేందుకు పవన్, త్రివిక్రమ్ మరోసారి జట్టు కట్టారు. గతంలో వీరి కాంబినేషనల్‌ వచ్చిన జల్సా, త్రివిక్రమ్ చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎస్ రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

English summary
Venkatesh will do a cameo in Pawan Kalyan’s next film, to be directed by Trivikram. The film also star Keerthy Suresh and Anu Emmanuel. he latest update on the project is that actor Venkatesh, last seen in Guru, has been roped in for a cameo and he was spotted on the sets shooting on Tuesday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu