»   » పవన్ లవర్ ...ఎన్టీఆర్ గ్యారేజీలో

పవన్ లవర్ ...ఎన్టీఆర్ గ్యారేజీలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఇప్పటికే ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ పనులు మెదలయ్యాయి. ఇక ఈ నెల 20 నుండి రిపేర్స్ మెదలుపెడుతున్నారు ఎన్టీఆర్, కొరటాల శివ. మరి ఈ గ్యారేజి లో ఓ కీలకమైన పాత్రలో నటించే సీనియర్ ఎవరంటే...గతంలో సుపర్ హిట్ సుస్వాగంతం సినిమాలో పవన్ కు లవర్ గా కనిపించిన దేవాయాని.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ దేవాయాని మెహన్ లాల్ కు భార్యగా నటిస్తుందని వార్తా హల్ చెల్ చేస్తోంది. ఇదే కనుక నిజం అయితే మళ్లీ తన ఖాతాలో హిట్ వెసుకుని మరిన్ని అవకాశాలు సంపాదించాలని అనుకుంటున్నారని సమాచారం.

Actress Devayani in NTR’s Janatha Garage

గతంలో దేవాయాని మహేష్ సినిమా నానిలో కూడా తల్లి పాత్రతో మెప్పించారు, కాని ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. అయితే నటిగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాలో ఇంకా నిత్యామీనన్, సంమంతా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ ...ఎర్నేని నవీన్ నిర్మస్తున్నారు.

Actress Devayani in NTR’s Janatha Garage

ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి, దేవీశ్రీ ప్రసాద్ ఓ పాటను కూడా ట్యూన్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాని నిర్మాతలు, ఆగస్ట్ 12న విడుదల చెయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary
Veteran actress Devayani is also making her reentry into Telugu films after a long gap with NTR’s Janatha Garage movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu