Don't Miss!
- News
బాలకృష్ణను వీడని వివాదాలు: కొని తెచ్చుకున్న మరో కాంట్రవర్సీ
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Nithya Menen యువ హీరోతో ప్రేమ.. పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్.. అతను ఎవరంటే?
సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న టాలెంటెడ్ హీరోయిన్ నిత్యమీనన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు అయితే వెలువ డుతున్నాయి. ఇక ఆమె ప్రేమించింది మరెవరినో కాదు అని ప్రముఖ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకున్న స్టార్ హీరోని అని కూడా చెబుతున్నారు. త్వరలోనే వారి పెళ్లి జరగబోతోంది అని ఇప్పటికే చర్చలు కూడా ముగిసినట్లుగా సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

కమర్షియల్ సినిమాలను కాకుండా..
సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఒకరైన నిత్యమీనన్ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. బాలీవుడ్ లో కూడా నిత్యా మీనన్ కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. ఇక తెలుగులో అయితే నిత్యమీనన్ ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో తన పాత్ర మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పాలి. కమర్షియల్ సినిమాలను కాకుండా డిఫరెంట్ కథలను ఆమె ఎక్కువగా సెలక్ట్ చేసుకుంటూ ఉంటుంది

టెంప్ట్ అవ్వకుండా..
అలా.. మొదలైంది! సినిమా ద్వారా తెలుగు జనాలకు బాగా దగ్గరయిన నిత్యామీనన్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా కొన్ని మంచి సినిమాలో అయితే చేసింది. ఆమె ఒక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే తప్పకుండా అందులో ఏదో ఒక సరికొత్త కంటెంట్ ఉంటుంది అని ప్రేక్షకుల్లో కూడా నమ్మకం ఏర్పడింది. అంతలా తన స్టార్ హోదా పెంచుకున్నానని ఎప్పుడూ కూడా పారితోషాకానికి టెంప్ట్ అయ్యి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసేందుకు ఒప్పుకోలేదు.

మొదటిసారి ఇలా..
ఇక ప్రస్తుతం అయితే ఆమె నుంచి ఎక్కువగా సినిమాలు అయితే రావడం లేదు. చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో నటించింది. ఇటీవల అమెజాన్ లో ఒక వెబ్ సీరీస్ చేసింది. ప్రస్తుతం ఒక మలయాళం సినిమా పూర్తి చేయాల్సి ఉంది. ఇక ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైనట్లుగా కథనాలు పడుతున్నాయి. అయితే నిత్యమీనన్ కు సంబంధించిన లవ్ రూమర్స్ ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వినిపించలేదు. కానీ మొదటిసారి ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు మాత్రం ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ హీరోతో పెళ్లి
అయితే ఇంతవరకు కూడా తన పెళ్లి వార్తలపై నిత్యామీనన్ కొంచెం కూడా స్పందించింది లేదు. వారి సన్నిహితులు కూడా పెద్ద క్లారిటీ ఇవ్వలేదు. కానీ పెళ్లి చర్చలు మాత్రం కొనసాగుతున్నట్లుగా మలయాళం ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒక ప్రముఖ హీరోతోనే ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది.

గ్రీన్ సిగ్నల్?
మలయాళం సినిమా పరిశ్రమంలోనే మంచి గుర్తింపునందుకున్న ఒక హీరో నిత్యమీనన్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లుగా టాక్ అయితే వస్తోంది. అయితే ఎప్పుడూ కూడా నిత్యమీనన్ నుంచి ఆ విషయంపై కొంచెం కూడా క్లారిటీ అయితే వచ్చింది లేదు. ఇక రీసెంట్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో చర్చలు జరిపిన వారు పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే నిత్యమీనన్ నుంచి అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.