టాలీవుడ్‌లో సిమ్రాన్ రీ ఎంట్రీ.. ఆ హీరోకు అత్తగా..
ప్రముఖ నటి సిమ్రాన్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో కొన్నేళ్లపాటు ఒక ఊపు ఊపింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని గృహజీవితానికే పరిమతమైంది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సిమ్రాన్ ప్రస్తుతం ఓ తెలుగు సినిమాలో నటించనున్నారనే వార్త సినీ వర్గాల్లో ప్రచారం అవుతున్నది.
సప్తగిరి ఎల్‌ఎల్‌బీ తర్వాత కమెడియన్ కమ్ హీరో సప్తగిరి మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది.

అత్త, అల్లుళ్ల కథా నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో సప్తగిరికి సిమ్రాన్ అత్తగా నటిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది. నటీనటుల వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించనున్నది.


Click it and Unblock the Notifications











