»   » ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం.. నిర్మాత, దర్శకుల కసరత్తు..

ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం.. నిర్మాత, దర్శకుల కసరత్తు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఒక్కసారిగా జాతీయ స్థాయి నటుడయ్యాడు. బాహుబలి అనంతరం సుమారు ఐదేండ్ల తర్వాత ఇతర చిత్రంలో యంగ్ రెబల్‌స్టార్ నటిస్తున్నాడు. సాహు అనే పేరుతో నిర్మితమవుతున్న చిత్రానికి సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాహుబలి చిత్రాన్ని బాలీవుడ్‌లో ప్రమోట్ చేస్తున్న ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ నిర్మాణ సారధ్యంలో 'అమరేంద్ర బాహుబలి' ప్రభాస్‌ను బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

బాహుబలి2 రిలీజ్ తర్వాత

బాహుబలి2 రిలీజ్ తర్వాత

బాహుబలి2 విడుదల తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందనే వార్తలు విస్తృతమయ్యాయి. ఆ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించనున్నారనే మరో వార్త ఇటీవల వెలుగులోకి వచ్చింది. బాహుబలి తర్వాత హిందీ చిత్రం చేయాలని రాజమౌళిపై కరణ్ జోహర్ ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తున్నది. అంతేకాక బాలీవుడ్‌లో ప్రభాస్‌ను లాంచ్ చేయడానికి వారిద్దరూ జోడి కడుతున్నట్టు సమాచారం.

 బాహుబలి1 చిత్రానికి వందకోట్లు..

బాహుబలి1 చిత్రానికి వందకోట్లు..

బాహుబలితో హిందీ రాష్ట్రాల్లో ప్రభాస్ మంచి ఆదరణను చూరగొన్నాడు. బాహుబలి1 చిత్రం డబ్బింగ్ సినిమాగా విడుదలై వంద కోట్ల క్లబ్‌లో చేరింది. దాంతో ప్రభాస్‌కు బాలీవుడ్‌లో కూడా మార్కెట్ ఉన్నదనే విషయం స్పష్టమైంది.

త్వరలో అధికారిక ప్రకటన

త్వరలో అధికారిక ప్రకటన

ప్రభాస్‌తో సినిమా చేయడం వల్ల ఉన్న సానుకూల అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభాస్‌తో సినిమా చేయాలని కరణ్ జోహర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే ఈ సినిమాపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశముందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఏప్రిల్ 28న విడుదల

ఏప్రిల్ 28న విడుదల

కాగా, రూ.250 కోట్లతో తెరెకెక్కిన బాహుబలి2 చిత్రం రిలీజ్‌కు ముందే శాటిలైట్ రైట్స్, పంపిణీ హక్కుల కింద రూ.500 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు నటించారు.

English summary
After Baahubali 2, reports suggest that Prabhas is all set to foray into Bollywood, which will be bankrolled by Karan Johar. If the news is anything to go by, the project will be helmed by SS Rajamouli himself. Directed by SS Rajamouli, Baahubali 2 takes the story forward from where Baahubali: The Beginning and slated to release on April 28th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu