»   » ఆసుపత్రిలో కోలుకుంటున్న నిన్నటి మెగాస్టార్(ఫోటో)

ఆసుపత్రిలో కోలుకుంటున్న నిన్నటి మెగాస్టార్(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నిన్నటితరం మెగాస్టార్ దిలీప్ కుమార్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. 90 ఏళ్ల ఈ లెజండరీ నటుడు సెప్టెంబర్ 15న తేలికపాటి గుండె పోటుతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన్ను వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

దీలీప్ కుమార్ భార్య సరీరా భాను చెప్పిన వివరాల ప్రకారం...ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిచ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది. కాగా ఆయన మరణించారనే వందంతులు వ్యాపించడంతో అభిమానులు ఖంగుతిన్నారు. అయితే ఈ విషయమై దిలీప్ సన్నిహితులు వెంటనే స్పందించారు. ఆయన క్షేమంగా ఉన్నారని, వదంతులు నమ్మ వద్దని మీడియా ప్రకటన చేసారు.

Ailing Dilip Kumar's Latest Picture From Hospital

దిలీప్ కుమార్‌కు 14 ఏళ్ల క్రితం హార్ట్ సర్జరీ జరిగింది. ఈ క్రమంలో వయసు పై బడటంతో ఇపుడు మళ్లీ సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ను ఐసియూలో ఉంచి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. కాస్త కోలుకున్న తర్వాత డిచ్చార్జి చేసి ఇంటికి పంపే అవకాశం ఉంది.

బాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలలో దిలీప్ కుమార్ ఒకరు. ఆయన సినిమాలంటే అప్పట్లో మహా క్రేజ్. దీలీప్ కుమార్‌ను ట్రాజెడీ కింగ్ అని కూడా అంటుంటారు. దిలీప్ నటించిన జోగన్(1950), దీదార్(1951), దాగ్(1952), దేవ్‌దాస్(1955), యాహుది(1958), మధుమతి(1958) చిత్రాలు అప్పట్లో భారీ విజయం సాధించాయి.

English summary
Bollywood's yesteryear megastar Dilip Kumar, who is currently admitted at Mumbai's Lilavati hospital, is reportedly recovering. The 90-year-old legendary actor was admitted in the hospital on September 15, 2013, after a mild heart attack.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu