»   » తనకంటే చిన్నవాడైన కుర్ర హీరోతో రొమాన్స్ చేయబోతున్న ఐశ్వర్యరాయ్?

తనకంటే చిన్నవాడైన కుర్ర హీరోతో రొమాన్స్ చేయబోతున్న ఐశ్వర్యరాయ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

యే దిల్ మై ముష్కిల్ చిత్రంలో తనకంటే చిన్నవాడైన రణబీర్ కపూర్‌తో రొమాన్స్ చేసిన ఐశ్వర్యరాయ్..... మరో కుర్ర హీరోతో జతకట్టబోతున్నారా? అంటే అవుననే వార్తలు బాలీవుడ్ మీడియా వర్గాల నుండి వినిపిస్తున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన షామిద్ కపూర్‌కు జోడీగా ఐశ్వర్యరాయ్ నటించబోతోందట.

షాహిద్ కపూర్ త్వరలో 'వో కౌన్ థి' రీమేక్ చేయబోతున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్‌గా యామి గౌతమ్ ఎంపికైందంటూ నిన్నమొన్నటి వరకు ప్రచారం జరిగింది. అయితే తాజాగా యామి కాదు ఐశ్వర్యరాయ్ అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

Aishwarya Rai Might Be Seen Opposite Shahid Kapoor In Woh Kaun Thi Remake

అయితే ఈ వార్తలో నిజం ఎంత అనే విషయం తేలాల్సి ఉంది. షాహిద్-ఐష్ జంటగా నటిస్తున్నారనే విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు. ఐశ్వర్యరాయ్ వయసు 44 కాగా, షాహిద్ వయసు 37 సంవత్సరాలు. వయసు పరంగానే కాదు, ఫిజిక్ పరంగా కూడా ఈ ఇద్దరికీ సూటవ్వదు అనేది కొందరి వాదన.

కాగా... ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం 'ఫన్నే ఖాన్' అనే సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. మరో వైపు షాహిద్ కపూర్ తన తాజా చిత్రం 'బట్టి గుల్ మీటర్ చాలు' అనే చిత్రంలో నటిస్తున్నాడు.

English summary
Rumours mills are busy churning out every possible name that could be a part of Shahid Kapoor's upcoming project,the remake of Woh Kaun Thi. According to the latest buzz, it was Yami Gautam who was being considered for the role, but now we hear it's not Yami but Aishwarya Rai Bachchan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X