»   » హాట్ టాపిక్: ఐశ్వర్యరాయ్ వేరు కాపురం?

హాట్ టాపిక్: ఐశ్వర్యరాయ్ వేరు కాపురం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ కూడా సాధారణ గృహిణి మాదిరి అత్తారింట్లో ఇబ్బందులు ఎదుర్కొంటోందా? అంటే అవుననే వార్తలు బాలీవుడ్లో షికార్లు చేస్తున్నాయి. అత్త జయా బచ్చన్ ఇంట్లో తన పెత్తనం కొనసాగిస్తోందని, ఇది ఐశ్వర్యకు కాస్త ఇబ్బందిగా మారిందని టాక్.

ఈ పరిణామాలు మరిన్ని పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. వేరు కాపురం పెడదామని భర్త అభిషేక్ బచ్చన్‌పై ఐశ్వర్య ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అత్తమామలు జయా-అమితాబ్‌లకు కొంతకాలం దూరంగా ఉందామని, అలా అయితేనే పరిస్థితి చక్కబడుతుందని భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోందట ఐష్.

అయితే ఐశ్వర్యరాయ్, జయా బచ్చన్ మధ్య ఎందుకు విబేధాలు వచ్చాయి? అనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. గతంలో జయాబచ్చన్ కోడలిపై అమితమైన ప్రేమ చూపించేది. కోడలిపై ఈగ వాలినా సహించేది కాదు. ఆ మధ్య జరిగిన ఓ ప్రెస్ మీట్లో.....తన కొడలిని మీడియా వారు 'ఐశ్వర్య' అని సంబోధించడం జయా బచ్చన్‌కు కోపం తెప్పించింది. తన కోడలిని అలా పిలవొద్దని....'ఐశ్వర్య రాయ్ బచ్చన్' అని పూర్తి పేరుతో పిలవాలని ఆమె సూచించారు. 'ఏంటి ఐశ్వర్యా..ఐశ్వర్యా అని పిలుస్తున్నారు. ఆమె మీతో కలిసి చదువుకుందా?' అంటూ జయా బచ్చన్ మీడియా ప్రతినిధులపై ఫైర్ అయ్యారు.

జయా బచ్చన్...తన కోడలికి మద్దతుగా నిలవడం అదే తొలిసారి కాదు. గతంలోనూ ఆమెపై సినిమా గాసిప్పులు వచ్చినప్పుడు ఆమె తీవ్రంగా స్పందించారు. తమ కోడలిని అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రయత్నించిన కొందరు స్టార్ హీరోలను ఆమె పరోక్షంగా హెచ్చరించారు కూడా. అయతే ఉన్నట్టుండి కోడలు ఐశ్వర్యపై జయా బచ్చన్ ఇపుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది అనేది చర్చనీయాంశం అయింది.

English summary
Bollywood sources said that, Aishwarya Rai Bachchan doesn’t share a good vibe with her mother-in-law Jaya Bachchan. Apparently, the former Miss World is unhappy with Jaya Bachchan interfering with her personal life and for keeping a constant tab on her activities. She is planning to move out into a separate home along with her hubby Abhishek Bachchan and beti Aaradhya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu