»   » పవన్ ని అడ్డుకుని, నిలదీయనున్న అజయ్

పవన్ ని అడ్డుకుని, నిలదీయనున్న అజయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కల్యాణ్, ఎస్.జె.సూర్య కాంబినేషన్‌లో ఓ చిత్రం ఆ మధ్యన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫన్ తో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో పవన్ ...ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నారు. ఆయన్ని నిలదీసి, అడ్డుకునే పవర్ ఫుల్ విలన్ గా యంగ్ విలన్ అజయ్ కనిపించనున్నాడని సమాచారం. అజయ్, పవన్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు.

జూలై రెండో వారం నుంచి ఈ చిత్రం షూటింగ్ లో పవన్ పాల్గొంటారు. అలాగే అజయ్ నటనని, తమిళ హీరో సూర్య తాజా చిత్రం 24 చూసి దర్శకుడు ఎస్ జె సూర్య వెంటనే అజయ్ కు ఫోన్ చేసి అభినందించి, తన సినిమాలో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో తన పేరు మారు మ్రోగుతుందని అజయ్ భావిస్తున్నారు.

అజయ్ గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీలో చిన్న పాత్ర వేసారు. అలాగే గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కు సోదరుడుగా కనిపించారు. ఆ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు మూడో సారి వీరిద్దరి కాంబనేషన్ లో చిత్రం రూపొందనుంది.

Ajay to play villain in Pawan Kalyan’s latest movie

నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్ మారర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యాక్షన్ లీడర్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కథ, మాటలు ఆకుల శివ అందిస్తున్నారు. 'బిల్లా, బెంగాల్ టైగర్' వంటి చిత్రాలకు కెమెరామెన్‌గా చేసిన సౌందర్ రాజన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నాడు.

అలాగే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మాకడలి, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్‌లతో పాటు సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్‌లను ఎంపిక చేసినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రంలో పవన్ సరసన నటించేందేవరు..నటీనటుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో పవన్, ఎస్.జె.సూర్య కాంబినేషన్‌లో 'ఖుషి', 'పులి' చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.

English summary
SJ Surya has zeroed in on Ajay to play the antagonist in Pawan Kalyan' film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu