»   » అక్కినేని అఖిల్ ఎంట్రీ ఆ డైరక్టర్ తో ఫైనల్

అక్కినేని అఖిల్ ఎంట్రీ ఆ డైరక్టర్ తో ఫైనల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Akhil Akkineni
హైదరాబాద్: గత కొంత కాలంగా అక్కినేని అభిమానులను మాత్రమే కాక యావత్ తెలుగు సినీ అభిమానులు సైతం ఎదురుచూస్తున్న విషయం నాగార్జున రెండవ కుమారుడు అఖిల్ ఎంట్రీ. కొంతకాలం శేఖర్ కమ్ముల డైరక్ట్ చేస్తాడని, మరికొంతకాలం రాజమౌళితో లాంచ్ చేస్తాడని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే సరైన దర్శకుడు చేతిలో పెట్టాలని నాగార్జున తాపత్రయం. అందులో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు గా లాంచ్ చేయాలని ఒప్పించినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ బ్యానర్ పై ఈ చిత్రం చేయనున్నారని సమాచారం.

గతంలో అఖిల్ మాట్లాడుతూ... "నేను ఇప్పటిదాకా ఎటువంటి సినిమాను అంగీకరించలేదు. నా మొదటి సినిమాకు సిద్ధపడుతున్నాను" అని తెలిపాడు. ఇప్పటికే రాజమౌళి కుమారుడు కార్తీక్... అఖిల్ తో ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. మాటీవీ షార్ట్ ఫిలింస్ కంటెస్ట్ లో ఆ షార్ట్ ఫిలిం ప్రదర్శిస్తారని చెప్పుకుంటున్నారు. నాగచైతన్య ఎంట్రీ విషయంలో నాగార్జున అంచనాలు తారుమారయ్యాయి. చైతన్య తొలి చిత్రం'జోష్' అపజయాన్ని మూటగట్టుకుంది. ఈనేపథ్యంలో అఖిల్ విషయంలో అలా జరుగకూడదని నాగార్జున భావిస్తున్నారు.

మరో దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా అఖిల్ తో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ... "అక్కినేని అఖిల్‌తో నా సినిమా ఉండొచ్చు. కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడే అఖిల్‌తో నేను సినిమా చేయబోతున్నానన్న వార్త రూమరే. అయినా ముందు కథ దొరకాలి కదా. తనకు ఇప్పటికే ఓ స్టార్ సన్‌గా, క్రికెటర్‌గా ఓ క్రేజ్ ఉంది. చేస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే సినిమా చేయాలి. తను ఆల్రెడీ క్రికెట్‌తో స్టార్ అయ్యాడు అన్నారు శేఖర్ కమ్ముల.

English summary
Nagarjuna has been talking to director Trivikram to launch his son Akhil Akkineni as hero. Nagarjuna and Trivikram met for the same purpose. Although this development happened much before Trivikram's Attarinitiki Daaredi release, it's only now that the discussions have grown stronger.. Trivikram is well versed in making hit films with established stars. But launching a star's son is definitely something new for him. This is the only apprehension that Trivikram has about this project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu