»   » అఖిల్ ఆ దర్శకుడతోనా...రిస్క్ కాదా ?

అఖిల్ ఆ దర్శకుడతోనా...రిస్క్ కాదా ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడు అందరి దృష్టీ అఖిల్ చేయబోయే తర్వాత చిత్రంపైనే ఉంది. ఎందుకంటే వి.వి.వినాయక్ లాంటి స్టార్ డైరక్టర్ సినిమానే ప్లాప్ అయ్యింది. అఖిల్ కు సారీ కూడా చేప్పారు వినాయక్. ఈ నేపధ్యంలో అఖిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు. ఏ దర్శకుడుతో తదుపరి చిత్రం ఓకే చేస్తాడనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ...దేవకట్టా తో ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇది విన్న అక్కినేని అభిమానులు కంగారుపడుతున్నారు. ప్రస్దానం తప్ప ఈ దర్శకుడు కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రం లేదు. ఆటోనగర్ సూర్య, డైనమైట్ సినిమాలతో నిరాశపరిచిన దేవాకట్టాతో అఖిల్ సినిమా చేయటం రిస్క్ అంటున్నారు. కానీ అఖిల్ ఏం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడో అంటున్నారు.

Akhil may going to risk Another time

వాస్తవానికి దేవకట్టాని మొదట..వినాయిక్ కన్నా ముందు గా తమ అన్నపూర్ణలో కూర్చోబెట్టి అఖిల్ కు కథ వండించినట్లు సమచారం. అయితే భారీ కమర్షిల్ సినమాలో లాంచ్ అయితే ఉన్న యంగ్ హీరోలకు కరెక్టు పోటీ ఇవ్వవచ్చని భావించి, వినాయిక్ తో ముందుకు వెళ్ళారు. అయితే అదీ చీదింది.

అయితే మొదటి సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అవటంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎంత పేరున్న గొప్ప డైరక్టర్ అయినా ఫ్లాప్ సినిమా తీస్తాడు, ఫ్లాప్ ఉన్న డైరక్టర్ హీట్ సినిమా తీయెచ్చు అని భావిస్తున్నాడంటున్నారు.

Akhil may going to risk Another time

పోనీ ఇప్పటికే టాప్ లో ఉన్న త్రివిక్రమ్, సుకుమార్ లాంటి డైరక్టర్స్ కావాలంటే చాలాకాలం వెయిట్ చేయ్యాలి. అలాగని తన అన్నకు హిట్ ఇచ్చిన గౌతమ్ మీనన్ తో మందుకు వెళ్దామంటే మాస్ రూటునుంచి దారి తప్పినట్లు అవుతుంది. మనం దర్సకుడు కథ చెప్పినా అది పెద్దగా ఎక్కలేదంటున్నారు.

English summary
All eyes are on Akhil Akkineni's second project and the youngster is reportedly liked a script narrated by Deva Katta however he is yet to give his nod.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu