»   » అఖిల్ తదుపరి చిత్రం ఖరారు..డిటేల్స్

అఖిల్ తదుపరి చిత్రం ఖరారు..డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన తొలి సినిమా భారీ స్ధాయిలో ఖర్చు పెట్టి అదే స్ధాయిలో రిలీజ్ చేసినప్పటికీ ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుని కాస్త డీలా పడ్డాడు అఖిల్. అయితే చిత్రంగా తొలి సినిమా రిలీజ్ కు ముందే స్టార్ స్టేటస్ అందుకున్నాడు. దాంతో ఆ సినిమా ఫలితం తో సంబందం లేకుండా తన తదుపరి ప్రాజెక్టుల మీద దృష్టి పెడుతున్నాడు.

ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నదాన్ని బట్టి.. కమర్షియల్ విలువలతో వచ్చిన 'అఖిల్' కు డివైడ్ టాక్ రావటంతో నెక్ట్స్ సినిమాకు సామాజిక సందేశాలతో ముందుకెళ్ళే దర్శకుడిని తీసుకున్నాడన్న తెలుస్తోంది.

 Akhil next with Director Krish?

ఆ దర్శకుడు మరెవరో కాదు... క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ). క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు. కంచె సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించిన క్రిష్, అఖిల్ సినిమాకు ఓ కథను రెడీ చేసి చెప్పబోతున్నట్లు సమాచారం.

2016 ప్రారంభంలో ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాను గతంలో నాగార్జున, నాగచైతన్యలతో సినిమాలు రూపొందించిన డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్నారు.

English summary
Nagarjuna and Akhil are banking on director Krish for his second film.
Please Wait while comments are loading...