»   » ఎన్నారైతో అఖిల్ మాజీ ప్రేయసి పెళ్లి?.. మ్యారేజ్‌కు శ్రేయా గ్రీన్ సిగ్నల్!

ఎన్నారైతో అఖిల్ మాజీ ప్రేయసి పెళ్లి?.. మ్యారేజ్‌కు శ్రేయా గ్రీన్ సిగ్నల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌తో అఫైర్‌ వార్తలతో ఫ్యాషన్ డిజైనర్ శ్రేయాభూపాల్ మీడియా వెలుగులోకి వచ్చింది. అఖిల్‌తో నిశ్చితార్థం తర్వాత శ్రేయా పేరు మీడియాలో ప్రముఖంగా మారింది. ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ కావడంతో శ్రేయా పేరు మరింత మారుమోగింది. శ్రేయాకు సంబంధించిన మరో రూమర్ తాజాగా మీడియాలో నానుతున్నది. అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత ఎన్నారైతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఎన్నారైతో పెళ్లికి శ్రేయా గ్రీన్ సిగ్నల్

ఎన్నారైతో పెళ్లికి శ్రేయా గ్రీన్ సిగ్నల్

వ్యక్తిగత కారణాలతో విడిపోయిన తర్వాత అటు అక్కినేని ఫ్యామిలీ గానీ, ఇటీ జీవికే ఫ్యామిలీ గాని పెద్దగా స్పందించలేదు. అఖిల్ రెండో సినిమాపై దృష్టిపెట్టగా, శ్రేయా తన ఫ్యాషన్ డిజైనింగ్ పనులతో బిజీగా మారినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు శ్రేయా భూపాల్‌కు ఎన్నారై పెళ్లి సంబంధం చూపించడం ఆ తర్వాత ఆమె మరో మాట మాట్లాడకుండా ఒప్పేసుకోవడం జరిగిందట.

పెళ్లి ఫిక్స్ చేసిన కుటుంబ సభ్యులు

పెళ్లి ఫిక్స్ చేసిన కుటుంబ సభ్యులు

శ్రేయా భూపాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు పెళ్లిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తున్నది. అఖిల్ రెండో సినిమా ప్రారంభమైన రోజే ఈ వార్త యాదృచ్చికంగా వెలుగు చూడటం గమనార్హం. త్వరలోనే అధికారికంగా శ్రేయాభూపాల్ పెళ్లి వార్త వినవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఫ్యాషన్ డిజైనర్‌గా ..

ఫ్యాషన్ డిజైనర్‌గా ..

శ్రేయా భూపాల్‌కు దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో కూడా ఫ్యాషన్ డిజైనర్‌గా మంచి పేరు ఉంది. బాలీవుడ్ తారలు ఆలియా భట్, శ్రద్ధాకపూర్ లాంటి వారికి డిజైనింగ్ చేసింది. టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రియా శరణ్‌తో కలిసి శ్రేయా పని చేసింది. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలానిని తన గురువుగా భావించే శ్రేయా భూపాల్ అఖిల్‌తో బ్రేకప్ తర్వాత మరో పెళ్లికి రెడీ అవుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్

అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్

గత డిసెంబర్ లో అక్కినేని అఖిల్‌తో శ్రేయకు నిశ్చితార్ధం జరగడం.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ కావడం జరిగిన విషయం తెలిసిందే. మనస్పర్ధల కారణంగానే అఖిల్, శ్రేయాలు విడిపోయినట్టు వార్తలు వచ్చాయి.

English summary
Akhil Akkineni who recently got engaged to Shriya Bhupal were separated due to unspecified reasons. As the engagement is broken with Akhil Akkineni and the marriage is called off. There is rumour that GVK family has fixed Shriya’s marriage with an NRI. Shriya also given green signal to this marriage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu