»   » నాగ్ 'మనం' ఆ హాలీవుడ్ చిత్రం ప్రేరణతో ...?

నాగ్ 'మనం' ఆ హాలీవుడ్ చిత్రం ప్రేరణతో ...?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న 'మనం' సినిమా ఫస్ట్ లుక్ నిన్న విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ అందర్నీ ఆశ్చర్యపరచడమే కాకుండా ఆ సినిమా పట్ల అంచనాల్ని ఒక్కసారిగా రెట్టింపు చేసేసింది. అక్కినేని అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'ఇష్క్' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకుడు. అయితే ఈ ఫస్ట్ లుక్ చూసిన వారందరూ..ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం Back to the Future (1985) ప్రేరణ తో రూపొందుతోందని అంటున్నారు.


Back to the Future ప్రేరణతో ఆల్రెడీ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో యాక్షన్ రీ ప్లే చిత్రం వచ్చి ప్లాప్ అయ్యింది. అయితే తెలుగులో పూర్తి కామెడీతో రూపొందుతోందని,ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ప్రకారం నాగచైతన్య తాతగా..ఆయన కొడుకుగా నాగార్జున, నాగార్జున కొడుకుగా నాగేశ్వరరావు రివర్స్ లో కనిపిస్తారు. నాగార్జున సరైన పొజిషన్‌లోనే నిలబడ్డారు కానీ, తాతామనవళ్ల ప్లేస్‌లే తారుమారయ్యాయి. అక్కినేని కూర్చోవాల్సిన ప్లేస్‌లో నాగచైతన్యను కూర్చోబెట్టడంలోనే ఉంది ఇక్కడ వెరైటీ. ఇలా ఒరిజనల్ లో ఉన్న మూడు తరాలు రివర్స్ లో కనిపించటంతో ఈ అంచనాలకు వచ్చినట్లు చెప్తున్నారు. బ్యాక్ టు ఫ్యూచర్ కధాంశం ప్రకారం టైమ్ మిషన్ ఎక్కిన టీనేజ్ హీరో... గతంలో కి వెళ్లి తన తండ్రి లవ్ స్టోరీని, మ్యారేజ్ లైఫ్ ని సెట్ చేస్తాడు. ఇదే ప్రేరణా కాదా అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాలి.


నాగార్జున మాట్లాడుతూ "నాన్న 90వ జన్మదినం సందర్భంగా 'మనం' ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నాన్న, చైతన్యతో కలిసి నేను నటిస్తున్న ఈ సినిమా హీరోగా నాకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది. మా బేనర్‌లో ఇది చిరస్థాయిగా నిలిచే సినిమా అవుతుంది'' అని చెప్పారు.


దర్శకుడు విక్రమ్‌కుమార్ మాట్లాడుతూ "నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, చైతన్య కలిసి నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఫస్ట్ లుక్‌లో వారి గెటప్స్ ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో సినిమా కూడా అంత డిఫరెంట్‌గా ఉంటుంది. వంద శాతం కామెడీతో, మంచి లవ్ ఫీల్‌తో, చక్కని ఎమోషన్‌తో 'మనం' అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరిస్తుంది. నాగేశ్వరరావు గారికి తొంభయ్యేళ్లు వచ్చినా సెట్‌లో అందర్నీ నవ్విస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు.
యూనిట్‌లో అందరికంటే హుషారుగా ఉంటూ అందర్నీ ఉత్సాహ పరుస్తారు. ఆయన వంటి లెజెండ్‌తో పనిచెయ్యడం ఎప్పటికీ మరచిపోలేని గొప్ప అనుభవం. 'మనం' తెలుగు చలన చిత్ర చరిత్రలో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తుంది'' అని చెప్పారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వై. సుప్రియ మాట్లాడుతూ "అరుదైన కాంబినేషన్‌తో వస్తున్న ఈ సినిమా అందరి అంచనాలనూ చేరుకుంటుంది. ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుగుతోంది. నవంబర్ నాటికి నిర్మాణం పూర్తవుతుంది'' అని తెలిపారు.


నాగార్జున సరసన శ్రియ, నాగచైతన్య సరసన సమంత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, నాగినీడు, శరణ్య, కాశీ విశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిశోర్, మేల్కోటే తారాగణం. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్థన్, పాటలు, చంద్రబోస్, వనమాలి, సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్ కె. కుమార్.

English summary
Sources close to the makers have revealed that Manam is loosely based on the English film Back to the Future. It is being said that Nagarjuna plays Naga Chaitanya’s son and Nageswar Rao as son of Nagarjuna! It would be really interesting to see how these actors pull off these role reversals on screen. Buzz is that Nagarjuna goes back from the future to help himself and his father. Back to the Future has already been remade in Bollywood in recent times with Akshay Kumar and Aishwarya Rai in the lead as Action Replay. But the film did not fare well at the box office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu