»   » హీరోయిన్ గా శృతి హాసన్ చెల్లెలు ఖరారు...డిటేల్స్

హీరోయిన్ గా శృతి హాసన్ చెల్లెలు ఖరారు...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై : తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న శృతి హాసన్ చెల్లి త్వరలో ప్రేక్షకులను అలరించటానికి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. కమల్‌ హాసన్‌ రెండవ కుమార్తె అయిన అక్షర హాసన్ ఆర్‌.బల్కి రూపొందించబోతున్న ఓ హిందీ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోబోతున్నారు. ఇంతకాలం డైరక్షన్ డిపార్టెమెంట్ లో అశోశియేట్ డైరక్టర్ గా పలువురు దర్శకుల దగ్గర పనిచేసిన అక్షర ఉన్నట్టుండి నటనవైపు ఆసక్తి చూపించటంతో కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ధనుష్ సరసన ఆమె హీరోయిన్ గా కనిపించనుంది.

అలాగే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మరో కీలకపాత్రలో చేయనున్నారు. అమితాబ్ తో బల్కి గతంలో చీనీకామ్, పా చిత్రాలు రూపొందించారు. దాంతో ముంబయికి మకాం మార్చమని చెల్లెలికి సలహా ఇచ్చిందట శ్రుతి హాసన్‌. అక్షర కూడా ముంబయిలో ఫ్లాటు కోసం అన్వేషిస్తున్నట్లు సన్నిహితులు తెలిపారు. కమల్ కూతురు అనే ముద్రతో వెండి తెర మీదకొచ్చినా ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది శ్రుతి హాసన్‌. ప్రస్తుతం ఆమె తెలుగు, హిందీల్లో చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉంది. ఇప్పుడు ఆమె బాటలోనే చెల్లెలు అక్షర హాసన్‌ కూడా నడవాలని భావిస్తున్నట్లు బాలీవుడ్‌ సమాచారం.

తండ్రితో పాటు శృతిని స్ఫూర్తిగా తీసుకుని అక్షర హాసన్‌ కూడా తెరంగేట్రం చేయబోతోందని వినికిడి. ఇందుకోసం ఇప్పటికే పావులు కదుపుతోందని, అందుకు తండ్రి మద్ధతు కూడా ఆమెకు ఉందని అంటున్నారు. అక్షర హాసన్‌ మొదటిగా బాలీవుడ్‌లో పాగా వేయాలని కోరుకుంటోందని, ఓ హిందీ చిత్రంలో ఆమెను ఎంపికచేశారని చెప్పుకుంటున్నారు. అక్షర కూడా తన అక్క శృతి మాదిరిగానే సినీ పరిశ్రమలో ఏ శాఖ ఎంచుకోవాలన్న తర్జనభర్జనలో ఉందని అంటున్నారు. మొదట్లో శృతి కూడా గాయనిగా, సంగీత దర్శకురాలిగా రాణించాలని అనుకుని, ఆ తర్వాత నటనను వృత్తిగా ఎంచుకోవడం విశేషం. ఇక అక్షర కూడా హీరోయిన్‌గా, రచయిత్రిగా, దర్శకురాలిగా ఎందులో రాణిస్తే అందులో స్థిరపడాలని ఆకాంక్షిస్తోందట.

English summary
Kamal Haasan's younger daughter is stepping into film world as actor. As Shruti Haasan has already made a name for herself as leading actress in Telugu films, her sister Akshara is debuting as actress in a Hindi film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu