»   » కూతురు ఎఫైర్ గురించి అడిగితే కస్సుబుస్సుమన్న హీరోయిన్ తల్లి!

కూతురు ఎఫైర్ గురించి అడిగితే కస్సుబుస్సుమన్న హీరోయిన్ తల్లి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఈ మధ్య కాలంలో ఏ బాలీవుడ్ ఈవెంట్స్, పార్టీలు, అవార్డ్స్ పంక్షన్ చూసినా హీరోయిన్ అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా చట్టాపట్టాలేసుకుని కలిసి రావడం కనిపిస్తోంది. దీంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని, కలిసి సహజీవనం చేస్తున్నారనే వార్తలు బి-టౌన్ లో హల్ చల్ చేస్తున్నాయి.

అలియా భట్ తల్లి సోని రజ్దాన్ ఇటీవల మీడియాకు ఎదురు పడ్డారు. అలియా భట్, సిద్ధార్త్ మల్హోత్రా ఎఫైర్ గురించి అడిగితే.... ఆమె మీడియాపై కస్సుబుస్సులాడారు.

సిద్‌తో అలియా టైమ్ వేస్ట్ చేయడం లేదు

సిద్‌తో అలియా టైమ్ వేస్ట్ చేయడం లేదు

ఎందుకు దీన్ని(లింకప్) ఆమె పని నుండి వేరు చేసి మాట్లాడుతున్నారు? ఆమె ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేస్తే ఎందుకు ఆమె హార్డ్ వర్క్‌ను శంకిస్తున్నారు? సిద్దార్థతో అలియా టైమ్ వేస్ట్ చేస్తుందని నాకు ఎవరూ చెప్పలేదు. సెట్స్ కు లేటుగా వస్తుందనికానీ, ముందుగా వస్తోందని కానీ కంప్లైంట్స్ ఏమీ లేవు అని సోని రజ్దాన్ అన్నారు.

అలియా ఒక సాధారణమైన యువతి

అలియా ఒక సాధారణమైన యువతి

అలియా తన పనిని ఎంతో ప్రేమిస్తుంది. ఎంతో కాన్ఫిడెంటుగా హార్డ్ వర్క్ చేసే అమ్మాయి. ఆమె కూడా ఒక సాధారణమైన యువతే అని సోని అన్నారు.

అలియాకు ఒక సోషల్ లైఫ్ ఉండకూడదా?

అలియాకు ఒక సోషల్ లైఫ్ ఉండకూడదా?

అలియా షూటింగులు లేకుండా ఖాళీగా ఉన్నపుడు... ఎవరితో టైమ్ స్పెండ్ చేయాలనేది ఆమె చాయిస్. తనకు నచ్చిన వారితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. తనకంటూ సోషల్ లైఫ్ ఉండకూడదా? అంటూ సోని రజ్దాన్ ప్రశ్నించారు.

అలియా పెళ్లి గురించి అడిగితే..

అలియా పెళ్లి గురించి అడిగితే..

అలియా పెళ్లి గురించి అడిగితే.... ‘అలియా ప్రస్తుతం తన పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ మీదనే ఉంది. పెళ్లి గురించి ఆలోచించడం లేదు' అని సోని తెలిపారు.

ఇంకా చాలా సమయం ఉంది

ఇంకా చాలా సమయం ఉంది

‘నేను ఓ విషయం గురించి కచ్చితంగా చెప్పగలను. ఆమె మనసులో ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదు. అందుకు ఇంకా చాలా సమయం ఉంది. సమయం వచ్చినపుడు దాని గురించి మాట్లాడుకుందాం' అని సోని రజ్దాన్ అన్నారు.

సెలబ్రిటీలు డేటింగ్ చేయకూడదా?

సెలబ్రిటీలు డేటింగ్ చేయకూడదా?

గతంలో అలియాను సిద్ధార్థతో ఎఫైర్ గురించి ప్రశ్నించగా.... ‘మనం ఇండియాలో ఉన్నాం, ఒక జడ్జిమెంటల్ సొసైటీలో బ్రతుకుతున్నాం. ఇక్కడ అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ కలిగి ఉండటాన్ని చాలా పెద్ద తప్పుగా చూస్తారు' అంటూ అప్పట్లో అలియా వ్యాఖ్యానించారు.

హాలీవుడ్ సెలబ్రిటీలతో కంపేర్ చేస్తూ...

హాలీవుడ్ సెలబ్రిటీలతో కంపేర్ చేస్తూ...

హాలీవుడ్ తో పోలిస్తే బాలీవుడ్లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. హాలీవుడ్లో టైలర్ షిప్ట్ గురించి పరిశీలిస్తే... ఆమె అందరిలాగే డేటింగ్ చేసింది. అదే ఆమె ఇండియాలో ఉండి ఆ పని చేస్తే పరిస్థితి మరోలా ఉండేది అంటూ అలియా వ్యాఖ్యానించింది.

ఇక్కడ అలాంటి విషయాలు మాట్లాడకూడదు

ఇక్కడ అలాంటి విషయాలు మాట్లాడకూడదు

ఇండియాలో యాక్టర్స్ తమ ప్రైవేట్ లైఫ్ గురించి మాట్లాడకూడదు... మాట్లాడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అందరికీ తెలిసిందే. అందుకే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోడానికి ఈ విషయాల గురించి నేను మాట్లాడటం లేదు అని అలియా భట్ కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించారు.

English summary
If you've kept a tab on the recent Bollywood events/parties/awards, you must have noticed that the alleged lovebirds of the B-town, Alia Bhatt and Sidharth were seen arriving at most of the events together and those pictures, indeed hinted at their relationship! On the other side, while interacting with media, when Alia Bhatt's mom, Soni Razdan was asked about Alia-Sidharth affair, here's what the lady said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu