twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ కండీషన్స్ కు ఒప్పుకుంటేనే అల్లరి నరేష్ డేట్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : వరస ఫ్లాపులతో కెరీర్ వెనక్కి వెళ్తూండటంతో వాటికి చెక్ పెట్టడానికి అల్లరి నరేష్ కొన్ని కండీషన్స్ ని తన దర్శక,నిర్మాతలకు విధించటానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అవన్ని సక్రమంగా అమలు చేస్తే ఈ సంవత్సరం మూడు సినిమాలు రిలీజ్ అవుతాయని భావిస్తున్నాడు. ఎక్కువ సినిమాలు రిలీజ్ అయితే తన సక్సెస్ రేషియో కూడా పెరుగుతుందని ఆలోచనతో ఈ పనిచేస్తున్నడని అంటున్నారు. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నంతవరకూ ఆ కండీషన్స్ ఇవే...

    1) సినిమా మొత్తం అరవై రోజులు లోపే పూర్తి కావాలి

    2) టాకీ పార్ట్ - 45 రోజులు

    3) పాటలు - 15 రోజులు

    4)మొదట కమిటైన బడ్జెట్ కు రూపాయ కూడా ఎక్కువ ఖర్చుపెట్టకూడదు

    5)సీన్స్ లో డైలాగుల్లో ఎక్కడా పారెడీ, ఇతర చిత్రాల అనుకణ ఉండకూడదు

    6)కొత్త తరహా కామెడీ తో కథలు ఉండాలి

    7) జంబలికిడి పంబ, ఆ ఒక్కటీ అడక్కు, ఆలీబాబా అరడజను దొంగలు వంటి తన తండ్రి సూపర్ హిట్స్ కు సీక్వ్లెల్ చేయను..వాటితో కథలు తేవద్దు

    Allari Naresh Conditions to Directors

    ''ఈవీవీ సినిమా సంస్థ నుంచి ఓ సినిమా వస్తోందంటే 'కచ్చితంగా మంచి సినిమానే అయ్యుంటుంది' అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అందుకే మేం కూడా నాన్న పేరు.. పరువు నిలబెట్టే సినిమాలే తీయాలని నిర్ణయించుకొన్నాం'' అంటున్నారు అల్లరి నరేష్‌.

    ఇక ''నన్ను దర్శకుడిగా చూడాలన్నది నాన్న కల. నేనూ ఆ ప్రయత్నాల్లోనే ఉన్నా. నటిస్తూ ఓ చిత్రాన్ని నిర్మించడం సులభమే. కానీ నటిస్తూ, దర్శకత్వం వహించడం చాలా కష్టం. అందుకే ఇంతకాలం వేచి చూశా. 2017లో ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తా. 50 చిత్రాల మైలురాయికి దగ్గర పడ్డా. ఆ సినిమా ఎలా ఉండాలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ప్రత్యేకంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనలూ లేవు. కానీ ఓ మంచి చిత్రంగా మిగిలిపోవాలి. జయాపజయాలు మామూలే. మా నాన్న కెరీర్‌లోనూ అంతే. వరుసగా 22 విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. ఆ తరవాత ఫ్లాపులొచ్చాయి. మళ్లీ ఓ హిట్టుతో ట్రాక్‌లోకి వచ్చేశారు. ఎవరికైనా అంతే. ఓ హిట్టు దొరికితే.. జాతకాలు మారిపోతాయి''.

    English summary
    Allari Naresh has come up with new conditions for his directors and producers to have at least 5 releases in a year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X