»   » అల్లు అరవింద్, అల్లు అర్జున్... అసంతృప్తిగా ఉన్నారా?

అల్లు అరవింద్, అల్లు అర్జున్... అసంతృప్తిగా ఉన్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ త్వరలో 'సరైనోడు' మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఎలాంటి ఫంక్షన్ నిర్వహించకుండా డైరెక్టుగా మార్కెట్ లోకి రిలీజ్ చేసి.....వైజాగ్‌లో ఆడియో సక్సెస్ మీట్ పేరుతో గ్రాండ్ ఫంక్షన్ నిర్వహించారు.

సినిమాకు సంబంధించిన హడావుడి, ప్రమోషన్లు బాగానే సాగుతున్నా ఓ విషయంలో మాత్రం ఈ చిత్ర నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం 'సరైనోడు' సినిమాకు సంబంధించిన ఆడియో విషయంలోనే అని అంటున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. అయితే బన్నీ తమన్ నుండి ఇంకా బెటర్ మ్యూజిక్ ఆశించారని టాక్. ఆడియన్స్ నుండి కూడా ఈ పాటలకు రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు.

 Allu Aravind and Bunny not happy?

వాస్తవానికి ఈ సినిమాకు గతంలో బన్నీకి పలు సూపర్ హిట్ మ్యాజిక్ ఆల్బమ్స్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ తోనే మ్యూజిక్ చేయించాలనుకున్నారు అరవింద్. కానీ లెజెండ్ సినిమా సమయంలో దేవిశ్రీ, బోయపాటి మధ్య చిన్నపాటి విబేధాలు వచ్చాయి. దీంతో ఈ ఇద్దరూ కలిసి పనిచేసే పరిస్థితి లేక పోవడంతో తమన్ తో మ్యూజిక్ చేయించారు.

మ్యూజిక్ యావరేజ్ గా ఉన్న సినిమాపై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. సరైనోడు చిత్రాన్ని ఏప్రిల్ 22న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. బోయపాటి స్టైల్లో ఉన్న ఈ ట్రైలర్‌లో బన్నీ అదరగొట్టాడంటూ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

English summary
Sarrainodu audio album was directly launched. As per grapevine Aravind and Arjun expected a lot better album from Thaman SS, but the music director couldn’t come up with better tunes in spite of taking a lot of time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu