»   » పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ కి హ్యాండ్ ఇచ్చిన గీతాఆర్ట్స్...!

పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ కి హ్యాండ్ ఇచ్చిన గీతాఆర్ట్స్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా కాంపౌండ్ నుండి ఓ సినిమా వస్తోందంటే..ఆ సినిమా గురించి అల్లు అరవింద్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు అతనే ముందుండి అన్ని చూసుకుంటాడు. కానీ అందుకు బిన్నంగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరో సినిమాని నిర్మించకపోతే కనీసం ఒక్క ఏరియాకైనా దాని పంపిణీ హక్కులు తీసుకునే అల్లు అరవింద్ 'తీన్ మార్" చిత్రానికి దూరంగా ఉన్నాడు. 'తీన్ మార్" చిత్రాన్ని ఏ ఏరియాకి కూడా గీతా డిస్ట్రిబ్యూషన్ హౌస్ పంపిణీ చేయడం లేదు. చాలా చోట్ల కొత్త, లేదా అంతగా అనుభవం లేని డిస్ట్రిబ్యూటర్లే ఈ చిత్రాన్ని కొన్నారు. ఎక్కడైనా కాస్త లాభం వచ్చే అవకాశం ఉందనిపిస్తే వదులుకోని అల్లు అరవింద్ ఈ చిత్రానికి దూరంగా ఉండడంతో పవన్ కళ్యాణ్ తో అతనికి విభేధాలొచ్చిన విషయం మళ్లీ హైలైట్ అయింది.

ఏదో నామ్ కే వాస్తేగా తీన్ మార్ ఆడియో రిలీజ్ కి వచ్చిపోయిన అల్లు అరవింద్ అంతటితోనే ఆగిపోయాడు. కేవలం అల్లు అరవింద్ మాత్రమే కాకుండా గీతా ఆర్ట్స్ సినిమాల్ని వేరే ఏరియాల్లో ఎక్కువగా పంపిణీ చేసే వాళ్లు కూడా తీన్ మార్ కి దూరంగానే ఉన్నారు. గీతా ఆర్ట్స్ నిర్మించిన బద్రినాథ్, సమర్సించిన 100%లవ్ పై మాత్రమే అల్లు అరవింద్ దృష్టి పెట్టాడు. మరి పవన్ కళ్యాణ్ కి హ్యాడ్ ఇవ్వడంలో ఆంతర్యమేమిటో

English summary
Mega Producer Allu Aravind never leave a chance to distribute a film when there is profit. But this time he is staying away from Pawan Kalyan's upcoming film 'Teenmaar'. This is making rumors true that there are internal disputes between them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu