twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ ఆఫర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్.. పుష్ప కంటే ముందే మరో బడా ప్లాన్!

    |

    పుష్ప సినిమాపై కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అంచనాలు భారీగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. టీజర్ కు నార్త్ జనాల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు సుకుమార్ కూడా ఈ సినిమాను నెవర్ బిఫోర్ అనేలా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పుష్ప విడుదల కంటే ముందే ఒక బడా ప్లాన్ వేసినట్లు టాక్ వస్తోంది. ఎలాగైనా సినిమా రిలీజ్ కంటే ముందే ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని ఒక స్కెచ్ వేస్తున్నట్ల సమాచారం.

    సుకుమార్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేశాడు

    సుకుమార్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేశాడు

    స్టైలిష్ స్టార్ గా అభిమానులకు ఎంతగానో దగ్గరైన అల్లు అర్జున్ ఇటీవల ఐకాన్ స్టార్ గా మరో కొత్త క్రెడిట్ అందుకున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాతో తప్పకుండా బన్నీ వండర్ క్రియేట్ చేస్తాడని సుకుమార్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేశాడు. దానికి తోడు ఫస్ట్ లుక్ టీజర్ కూడా రికార్డు స్థాయిలో వ్యూవ్స్ అందుకుంది.

    అవన్నీ బన్నీ ఆలోచనలే..

    అవన్నీ బన్నీ ఆలోచనలే..

    బన్నీ కూడా పుష్ప ఒక మంచి అవకాశం అనుకోని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించడానికి ప్లాన్ వేసి సక్సెస్ అయ్యాడు. మొదట అయితే ఈ సినిమాను కేవలం తెలుగులోనే అనుకున్నారు. ఇక చివరికి సినిమా రెండు భాగాలుగా రావడానికి కారణం కూడా అల్లు అర్జున్ అనే టాక్ వచ్చింది. లెన్త్ ఎక్కువయ్యిందని టెన్షన్ పడుతున్న తరుణంలో అనవసరంగా ఎడిట్ చేయడం ఎందుకని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనే ఆలోచనకు బన్నీ బలాన్ని ఇచ్చాడట.

    ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా

    ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా

    ఎలాగైనా పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా హిట్ అందుకోవాలని బన్నీ నెవర్ బిఫోర్ అనేలా కష్టపడుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా సినిమాను నిర్మిస్తోంది. మొదట 130కోట్లతో అనుకున్నారు కానీ ఆ తరువాత 160కోట్లకు వచ్చింది. ఇక రెండు బాగల వలన మరికొంత పెరగవచ్చట.

    Recommended Video

    DSP Vs Thaman : ఎవరి పారితోషికం ఎక్కువ? Tollywood లో మ్యూజికల్ రేస్ ! || Filmibeat Telugu
    పుష్ప కంటే ముందే..

    పుష్ప కంటే ముందే..

    ఇక పుష్ప రిలీజ్ కాకముందే బన్నీ బాలీవుడ్ లో డైరెక్ట్ గా ఒక సినిమాను ఓకే చేయించుకోవాలని చూస్తున్నాడట. ఇదివరకే చాలామంది బాలీవుడ్ దర్శకనిర్మాతలు బన్నీతో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు.

    ఇక ఇటీవల ఇద్దరు ప్రముఖ దర్శకులతో మాట్లాడినట్లు కథనాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యే విధంగా, అలాగే పుష్ప ప్రమోషన్ కు సైతం ఉపయోగపడేలా బన్నీ ఎనౌన్స్మెంట్ చేయాలని బావిస్తున్నాడట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజుకు ఓపిక పట్టాల్సిందే.

    English summary
    Needless to say, what level of fans are waiting for Puspa, one of Tollywood's Biggest Pan India movies. Even the expected dose has been increasing exponentially since it was said to be coming in two parts. With the first look teaser, it became clear that director Sukumar is making his third film with stylish star Arjun, which will make him look even different.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X