»   » అల్లు అర్జున్ హానీమూన్ గురించి లేటేస్ట్ ఇన్పరమేషన్..

అల్లు అర్జున్ హానీమూన్ గురించి లేటేస్ట్ ఇన్పరమేషన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ వివాహాం హైటెక్స్‌లో మార్చి 6వ తేదీన అంగరంగ వైభవంగా స్నేహారెడ్డితో జరగనున్న విషయం అందరికి తెలిసిందే. పెళ్శి చేసుకున్న తర్వాత హానీమూన్‌కి వెళ్శడానికి అల్లు అర్జున్‌కి అస్సలు సమయం దోరకడం లేదంట. ప్రస్తుతం అల్లు అర్జున్ బద్రినాధ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో టాలీవుడ్‌లో నెలరోజులు స్ట్రయిక్ జరగడంతో సినిమా షూటింగ్‌లు అన్ని నిలచిపోయాయి. దాంతో బద్రినాధ్ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయ్యే పరిస్దితి కనిపించం లేదని సమాచారం.

అందుకుగాను అల్లు అర్జున్ తన హానీ మూన్‌ని కేవలం ఐదు రోజులకే పరిమితం చేశారంట. హానీమూన్ పూర్తి చేసుకోని వచ్చిన తర్వాత తిరిగి మరలా మార్చి 28నుండి షూటింగ్‌లో పాల్గోంటారని వినికిడి. ఇక అల్లు అర్జున్ హానీమూన్ కార్యక్రమం కోసం న్యూజిల్యాండ్ వెళ్శనున్నట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ బద్రినాధ్ సినిమా విషయానికి వస్తే ఇదోక సోషియో ఫాంటసీ సినిమాగా రూపోందిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ సమురాయ్‌గా నటిస్తున్నారు.

ఈసినిమాకి దర్శకత్వం వివి వినాయక్ వహిస్తున్నారు. ఈసినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తున్నారు. ఇది ఇలా ఉండే అల్లు అర్జున్‌ని మార్చి 4వ తేదీన చిరంజీవి గారింట్లో పెళ్శి కోడుకుని చేయనున్నారు.

English summary
Allu Arjun is getting reay to tie the knot with Sneha reddy on 6th March, meanwhile the pelli Koduku celebrations will be held at Chiru's residence on 4th of March. The latest we hear from filmnagar sources is about Allu Arjun's Honeymoon. Sources revealed that Allu Arjun is planning for Honeymoon in New Zealand and comes back within 4 to 5 days due to shooting busy. It is also heard that Bunny will go for a long tour once he completes the Badrinath shooting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu