»   » ఫ్లాప్ దర్శకుడుకి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్??

ఫ్లాప్ దర్శకుడుకి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్??

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదారాబాద్ : ఇప్పుడు ఉన్న యంగ్ హీరోల్లో అల్లు అర్జున్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రతీ సక్సెస్ ఫుల్ దర్శకుడు అతనితో సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా ఆయన ఓ ప్లాప్ దర్శకుడు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్. వరసగా సోలో, సారొచ్చారు వంటి ప్లాపులు ఇచ్చిన పరుశరామ్ చెప్పిన కథ నచ్చిన బన్ని ఆయనకు తన తదుపరి చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. అయితే పరుశరామ్ దర్శకుడుగా ఫెయిల్ అయినా డైలాగులు పరంగా ఆయన ఆకట్టుకుంటూనే వస్తున్నారు. ఈసారి మంచి కథ,కథనంతో ఆయన హిట్ కొడతారని అంటున్నారు.

'రేస్ గుర్రం' చిత్రం షూటింగుతో బిజీగా గడుపుతున్న అల్లు అర్జున్.....నెక్ట్స్ చిత్రం బలుపు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఉండబోతోందని తెలుస్తోంది. ఈచిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై దిల్ రాజు నిర్మించనున్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితమే గోపీచంద్ బన్నీకి కథ వినిపించాడని, అయితే 'బలుపు' రిజల్ట్ కోసం వెయిట్ చేసాడని, బలుపు హిట్ టాక్ రావడంతో అతనితో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. సినిమాపై అంచనాలు పెరగాలంటే దర్శకుడికి ఉన్న పేరు కూడా ముఖ్యం కాబట్టి బన్నీఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్‌, కిక్‌ దర్శకుడు సురేందర్‌ రెడ్డి కాంబినేషన్లో 'రేసు గుర్రం' సినిమా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విలన్ గా...భోజపురి హీరో రవి కిషన్ చేస్తున్నారు. రవికిషన్ ఈ చిత్రంలో శివారెడ్డి అనే పాత్రను పోషిస్తున్నారు. అతని పాత్ర ఓ రాజకీయనాయకుడుది అని తెలిస్తోంది. ఈ మేరకు రవికిషన్, అల్లు అర్జున్ పై సన్నివేసాలను అన్నపూర్ణా స్టూడియోలో నిన్న షూట్ చేసారు. ఈ చిత్రం విడుదల అయ్యాక తెలుగులోనూ పూర్తి బిజీ అవుతాననే నమ్మకంగా ఉన్నారు రవి కిషన్.


ఇందులో సలోని కీలక పాత్రలో నటిస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకుడు. నల్లమలుపు బుజ్జి, డా||వెంకటేశ్వరరావు నిర్మాతలు. మరో రెండు రోజుల పాటు ఇక్కడ చిత్రీకరిస్తారు. ఇప్పటికే లేట్ కావటంతో ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుపుతున్నారు. ఈ చిత్రం సంక్రాంతి (జనవరి 11)రిలీజ్ కానున్నదని తెలుస్తోంది. అదే సంక్రాంతికి...మహేష్ 1 నేనొక్కడినే,బాలకృష్ణ జయకృష్ణ చిత్రాలు విడుదల అవుతాయి. రేసుగుర్రం చిత్రం గత సంవత్సరం అక్టోబర్లోనే ఈ చిత్రం అఫీషియల్‌గా ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే రకరకాల కారణాల వల్ల లేటయ్యి....ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ మిగిలివున్నాయి. వాటిని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి వేగంగా పనులను పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రొడక్షన్ టీం ఈ సినిమాకు సంబందించిన ఎటువంటి ప్రకటన చేయలేదు. నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి

English summary
According to latest reports Allu Arjun has decided to work with director Parasuram whose last film Sarocharu was one of the big flop films last year.Circling back to Bunny present project Race Gurram, Bhojpuri actor Ravi Kishan has finished his shooting schedule and waving back good bye he showered praises on Bunny and their film unit. Race Gurram team is still shooting n and around Hyderabad and makers of the film is confident that the film will stand in Pongal race for sure.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu