For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ 'జులాయి'కథ ఇదేనా?

  By Srikanya
  |

  హైదరాబాద్ : అల్లు అర్జున్, ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన చిత్రం 'జులాయి'. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రానికి డి.వి.వి. దానయ్య సమర్పకుడు. ప్రపంచ వ్యాప్తంగా 1600 థియేటర్లలో ఈ నెల 9న సినిమాను విడుదల చేస్తున్నట్లు దానయ్య చెప్పారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథపై ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది.

  ఆ కథ ప్రకారం...రవి(అల్లు అర్జున్)ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. ఎప్పుడూ ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూంటాడు. అతని తండ్రి నారాయణ మూర్తి(ఎమ్.ఎస్)ఓ మిడిల్ క్లాస్ ఎంప్లాయి. ఎప్పుడూ కొడుకు చేసే పనులను అపోజ్ చేస్తూ ఈజీ మనీకోసం పోతే ఇబ్బందులు పడతావని హెచ్చరిస్తూంటాడు. ఈ నేఫద్యంలో రవి ఓ దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత అతను బిట్టుకు కారు లిప్ట్ ఇస్తాడు. బిట్టు అతని నుంచి ఆ క్యాష్ కొట్టాయనుకుంటాడు. అక్కడ నుంచి వీరి ఇద్దరి మధ్యా జరిగే సన్నివేసాలు ఆసక్తిగా ఉంటాయి. శతృవులుగా మారిన వీరు ఏమయ్యారు. రవి కోటీశ్వరుడు అయ్యాడా..బిట్టు ఏం చేసాడు అనేది క్లైమాక్స్.

  ''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్‌ శైలి సంభాషణలు, అర్జున్‌ నృత్యాలు అలరిస్తాయని''అన్నారు నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ. అలాగే...జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్‌ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు.

  అలాగే 'మా సినిమాకి సెన్సార్ సభ్యుల నుంచి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. త్రివిక్రమ్ పంచ్ డైలాగులకు బాగా ఎంజాయ్ చేశారు. అల్లు అర్జున్ సినిమాలో వైవిధ్యమైన పాత్ర పోషించారు. గత చిత్రాల పోలికలు కనిపించకుండా, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ కాకుండా ఇందులో బన్నీ పాత్రని త్రివిక్రమ్ డిజైన్ చేశారు. అలాగే రాజేంద్రప్రసాద్‌గారి కామెడీని ఈ మధ్య కాలంలో మనం మిస్సయ్యాం. దాన్ని పూర్తి స్థాయిలో ఈ సినిమాలో చూడవచ్చు. ఇలియానా అందం సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది' అన్నారు. సినిమా ప్రారంభంలో వచ్చే బ్యాంక్ సీన్, ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో యాక్షన్ సీన్లు సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయి. పీటర్ హెయిన్స్ యాక్షన్ సీన్లు బాగా తీశాడు. మెగాభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది' అన్నారాయన. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, సోనుసూద్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

  English summary
  Ravi(Allu Arjun) is a middle class guy who always love to have easy money. His father Narayana Murthy is a middle class employee who always opposes his son for his activities. Handling a large amount of cash after robbery Ravi meets Bittu seeking lift in his car. Bittu who tries to rob that cash from Ravi get
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X