For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ సరసన రానా హీరోయిన్ ?

  By Srikanya
  |

  హైదరాబాద్ : అల్లు అర్జున్ సరసన దగ్గుపాటి రానా తో లీడర్ లో చేసిన రిచా గంగోపాధ్యాయ చేసే అవకాసం ఉందని సమాచారం. అల్లు అర్జున్,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం 'ఇద్దరు అమ్మాయిలతో..' లో ఈమెను తీసుకోనున్నారు. మొదట అనుకున్నట్లుగా తాప్సీ కి డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటంతో రిచా సీన్ లోకి రానున్నదని తెలుస్తోంది. అమలా పాల్ మాత్రం మెయిన్ హీరోయిన్ గా కనిపించనుంది. అక్టోబర్ 17న ఈ చిత్రం ప్రారంభం కానుంది.

  అలాగే ఈ చిత్రం దీపావళి(నవంబర్ 13)నుంచి షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దాదాపు అరవై రోజుల పాటు స్పెయిన్ లోని బార్సిలోనా ప్రాంతంలో ఈ చిత్రంలో ఎక్కువ శాతం షూటింగ్ జరుపుతారు. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ బ్యాంకాక్ వెళ్లి ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ ని పూర్తి చేసుకుని వచ్చారు. రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసిన పూరీ జగన్నాగ్ ఈ మేరకు స్కిప్టు వినిపించటం జరగింది. అది విన్న అల్లు అర్జున్ చాలా ఎక్సైట్ మెంట్ తో ఉన్నారని సమాచారం. అసలు కరెక్షన్ ఏమీ చెప్పలేదని,ఈ చిత్రం తన కెరిర్ లో మరోసారి దేశముదరు రేంజిని దాటే హిట్ వస్తుందని నమ్మి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు.

  ఇక రిచా ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉన్న ఆమె తెలుగులో ఆఫర్స్ రాకపోవటానికి బాధ పడుతోంది. 'ఇప్పుడున్న ఇతర హీరోయిన్లతో కంపేర్ చేసుకుంటే ఏ విషయంలోనూ వాళ్లకి నేను తక్కువ కాను. కానీ, అవకాశాలు మాత్రం రావడం లేదు. బహుశా... నాకింకా ఇక్కడ టైం రాలేదేమో' అంటోంది. 'ఒక సినిమా హిట్ అయితే, ఆ క్రెడిట్ అంతా హీరోకీ, దర్శకుడికీ... అలా అలా పంచేసుకుంటారు. హీరోయిన్ కి ఏమాత్రం క్రెడిట్ వుండదు. అదే ఫ్లాప్ అయిందనుకోండి... ఆ తప్పంతా హీరోయిన్ కే అంటగడతారు. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే చాలు... ఇక ఐరెన్ లెగ్ బ్రాండ్ వేసేస్తారు' అంటూ వర్రీ అవుతోంది.

  దేశముదురు కాంబినేషన్ అల్లు అర్జున్,పూరీ జగన్నాధ్ ని రిపీట్ చేస్తూ బండ్ల గణేష్ రూపొందించే ఈ చిత్రం బారీగా రూపొందనుంది. హీరోయిన్స్ సెంట్రల్ గా నడిచే కధ కాబట్టి ఆ టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో చేసే ఇద్దరు హీరోయిన్స్ లో తాప్సీ ని ఎంపికచేసారు. మరొకరు కోసం చూస్తున్నారు. 2013 సమ్మర్ కి విడుదల అయ్యే ఈ చిత్రం కథ కేవలం ట్రీట్ మెంట్ బేసెడ్ గా నడుస్తుందిని సమాచారం.

  అల్లు అర్జున్ ఇటీవలే 'జులాయి'గా తెరపైకి వచ్చారు. ఆ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా బాగుంది. అలాగే మళయాళంలోనూ ఈ చిత్రం మంచి ఓపినింగ్స్ తెచ్చుకుంది. ఈ విషయమై మాట్లాడుతూ... ''నా సినిమాలు మలయాళంలోనూ ఆదరణ పొందడం సంతోషంగా ఉంది. అలాగని నేనేమీ అక్కడి హీరోలకు పోటీగా నిలుస్తున్నాను అనుకోను. నాకంటూ అక్కడో మార్కెట్‌ని ఏర్పరచుకోగలిగాను'' అన్నారు . ఇక 'జులాయి'తో మరో మెట్టు ఎక్కాను అన్నారు. ఆ మెట్టు త్రివిక్రమ్‌తో సినిమా చేయడమే... ఓ గొప్ప అనుభూతి అని వివరించారు.

  English summary
  It's been buzzed that Richa Gangopadhyay would play the second lead in the film Iddaru Ammayilatho. Although nothing has been confirmed officially, rumour mongers have been going agog with Richa's name for the romantic entertainer. Amala Paul is playing the main lead. Directed by Puri Jagannath and produced by Bandla Ganesh, Iddaru Ammayilatho would be majorly shot in Barcelona (Spain). The film would be launched on October 17 and the regular shooting would commence in November. Devi Sri Prasad is composing the music.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X