Pooja Hegde: అల్లు అర్జున్ సినిమాలో పూజా హెగ్డే.. 5 నిమిషాల కోసం అన్ని కోట్లా..

Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌ "AA22xA6" (వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా మారింది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దాదాపు రూ.700-800 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నా ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ లో నటించబోతుందట. కేవలం 5 నిమిషాల పాట కోసం కోట్లలో పారిదోషికం తీసుకోబోతుందట. ఇంతకీ ఆ మ్యారేంటీ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- దర్శకుడు అట్లీ కుమార్ కాంబో తెరకెక్కబోతున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా నిర్మించబోతున్నారట. ఇందులో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌పై సుమారు రూ.250 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం. మిగిలిన బడ్జెట్ ప్రొడక్షన్, టెక్నీషియన్స్, స్టార్ రెమ్యూనరేషన్స్‌పై వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, "పుష్ప 2" సక్సెస్ తరువాత బన్నీ మార్కెట్ ఆమాంతం పెరిగిన విషయం తెలిసిందే. ఆ క్రేజ్ కారణంగా ఈ సినిమాకు ఆయన రూ.175 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Allu Arjun s 800 Crore Sci-Fi Film with Atlee Pooja Hegde Offered 5 Crore for a Special Song

అల్లు అర్జున్ ఇప్పుడు షారుఖ్ ఖాన్, రజినీకాంత్, ప్రభాస్, అమీర్ ఖాన్ వంటి టాప్ స్టార్ హీరోల జాబితాలో చేరారని ఫిలిం సర్కిల్స్ చర్చిస్తోంది. ఈ పారితోషికం నిజమైతే, టాలీవుడ్‌లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోగా అల్లుఅర్జున్ రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. ఇక ఈ చిత్రంలో మరో హాట్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను సంప్రదించినట్లు సమాచారం. దీనికి గాను పూజాకు ఏకంగా రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది.

ఇటీవల రజినీకాంత్ హీరోగా వచ్చిన "కూలీ" సినిమాలో పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్‌కి దేశవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట భారీ విజయం సాధించడంతో పూజాకు మళ్లీ డిమాండ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ - అట్లీ కాంబో సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ పెడితే సినిమాకు అదనపు గ్లామర్, హైప్ వస్తుందని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. ఆమె కూడా ఈ ఆఫర్‌పై సానుకూలంగా స్పందించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. గతంలో పూజా హెగ్డే, అల్లు అర్జున్ జంటగా "దువ్వాడ జగన్నాథమ్", "అల వైకుంఠపురములో" సినిమాల్లో నటించి భారీ విజయాలు అందుకున్నారు. ఈ డీల్ ఒకే అయితే.. ఈ జంట ముచ్చటగా మూడోసారి తెరపై కనిపించబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఇంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నందున, "AA22xA6" సినిమా పాన్ ఇండియా లెవల్‌లో మాత్రమే కాదు, గ్లోబల్ లెవల్‌లో కూడా భారీ సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అల్లు అర్జున్ నటన, అట్లీ దర్శకత్వం, సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కలిస్తే బ్లాక్‌బస్టర్ ఖాయం అని అభిమానులు నమ్ముతున్నారు. అధికారిక ప్రకటనల కోసం అందరూ ఎదురు చూస్తున్నా, లీక్ అవుతున్న సమాచారం ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ నిజమైతే, "AA22xA6" సినిమాలో అది హైలైట్ సీక్వెన్స్‌గా నిలిచే అవకాశం ఉందని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X