For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘వైకుంఠపురములో’ ఎన్టీఆర్ సినిమాకు రీమేక్.. బయటకొచ్చిన షాకింగ్ న్యూస్.!

  By Manoj
  |

  'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బన్నీ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్, టబు, నివేథా పేతురాజ్, నవదీప్ తదితర నటులు కనిపించనున్నారు. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దీంతో సినిమాపై ఆసక్తి క్రమక్రమంగా పెరిగిపోతోంది. అదే సమయంలో హిట్ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు కూడా అంతే స్థాయిలో కనిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త..?

  అదే జోనర్‌గా వస్తోంది

  అదే జోనర్‌గా వస్తోంది

  రెండు సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘అల.. వైకుంఠపురములో' విషయంలో యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకుంటోందట. ఈ సినిమా కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అదిరిపోయే ఫ్యామిలీ డ్రామాను రాశాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన డైలాగులు ప్రధానాకర్షణ కానున్నాయని టాక్. అలాగే, స్క్రీన్ ప్లే కూడా అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారని టాక్.

  ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన

  ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన


  త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అల.. వైకుంఠపురములో' నుంచి ఇప్పటి వరకు విడుదలైన అన్ని పాటలు, టీజర్, పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘సామజవరగమన', ‘రాములో రాములా' పాటలు అయితే యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు పాటలు అత్యధిక స్థాయిలో వ్యూస్ సాధించడంతో పాటు లైకులను కూడా సంపాదించగలిగాయి.

  అక్కడ కూడా విడుదలవుతోంది

  అక్కడ కూడా విడుదలవుతోంది

  ఎంతో ప్రతిష్టాత్మక వస్తున్న ఈ సినిమాను కేరళలో కూడా విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం ‘అంగు.. వైకుంతపురతు' అనే టైటిల్‌తో మలయాళంలోకి ఈ సినిమాను డబ్బింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా ఇటీవల విడుదలైంది. అక్కడ బన్నీకి భారీ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ బాధ్యతలను ఆర్‌డీ ఇల్యుమినేషన్ సంస్థ తీసుకుందని సమాచారం.

  ‘అల.. వైకుంఠపురములో' స్టోరీ ఇదే

  ‘అల.. వైకుంఠపురములో' స్టోరీ ఇదే


  ఈ సినిమా కథ లీక్ అయిందంటూ కొద్ది రోజుల కిందట ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఒక ధనవంతుడు.. మరో ట్యాక్సీ డ్రైవర్ స్నేహితులు. వీళ్ల పిల్లలను చిన్నప్పుడే మార్చుకుంటారు. ధనవంతుడి కుమారుడైన బన్నీ అసలు విషయం తెలుసుకుని తన తండ్రి దగ్గరకు వెళ్లాలనుకుంటాడు. అయితే, అక్కడే ఉన్న ట్యాక్సీ డ్రైవర్ కొడుకు సుశాంత్ మాత్రం తన తండ్రి దగ్గరకు వెళ్లనంటాడు. అదే సమయంలో నవదీప్ షాకింగ్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఇంతకీ ఎవరి కొడుకు ఎవరు..? నవదీప్ ఎవరు..? అనేది తెరపైనే చూడాలి.

  #CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
  ఎన్టీఆర్ సినిమాకు రీమేక్

  ఎన్టీఆర్ సినిమాకు రీమేక్

  పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘అల.. వైకుంఠపురములో' ఎన్టీఆర్ సినిమాకు రీమేక్ అంటూ తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నందమూరి తారక రామారావు - సావిత్రి కాంబినేషన్‌లో వేదాంతం రాఘవయ్య తెరకెక్కించిన చిత్రం ‘ఇంటి గుట్టు'. 1958లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీని సీక్వెల్‌గా బన్నీ సినిమా తెరకెక్కుతోందట. ఇందులో ఇద్దరు స్నేహితులు కొడుకులను మార్చుకుంటారు. అందులో ఒకరు దొంగ, మరొకరు పోలీస్ అవుతారు. చివరకు వాళ్లు తమ తల్లిదండ్రుల చెంతకు చేరారా లేదా అన్నదే కథ.

  English summary
  Stylish Star Allu Arjun and the Wizard of words Trivikram Srinivas coming together for third time for "Ala Vaikunthapurramuloo". Two crazy production houses Geetha Arts and Haarika & Hassine Creations producing this project.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X