»   » బన్నీ కు పవన్ ఫ్యాన్స్ భలే ట్విస్ట్ ఇచ్చారే...ఇదో రికార్డ్ అయ్యి కూర్చుంది

బన్నీ కు పవన్ ఫ్యాన్స్ భలే ట్విస్ట్ ఇచ్చారే...ఇదో రికార్డ్ అయ్యి కూర్చుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''చెప్పను బ్రదర్'' అంశంతో అల్లు అర్జున్ పై మొదలైట్టిన పవన్ కళ్యాణ్ అభిమానుల పోరు... ఇప్పుడు ఆయన తాజా చిత్రం డీజే టీజర్ కు డిజ్ లైక్స్ రికార్డ్ క్రియేట్ చేసే దాకా వెళ్లిందని తెలుస్తోంది. పవన్ ఫ్యాన్స్ కావాలనే భారీ ఎత్తున ఆ టీజర్ కు డిస్లయిక్స్ కొట్టేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

పవన్ ఫ్యాన్స్ ... బన్నీ టీజర్ కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తూ ఇప్పుడు ఏకంగా సినిమా టీజర్ డిస్లయిక్స్ లో రికార్డు సృష్టించే స్థాయికి తీసుకెళ్లారు. అందుకే లైక్స్ కు ఈక్వల్ గా డిస్లయిక్స్ కూడా కనిపిస్తున్నాయి. సాధారణ సినిమా లవ్వర్స్ ఎవరైనా నిజంగానే టీజర్ నచ్చకపోయినా ఎవరో కొంత మంది తప్ప.. అసలు డిస్లయిక్ మాత్రం కొట్టరు.

కాని ఇలా రికార్డ్ క్రియేట్ చేసే రేంజులో డిజ్లయిక్ చేయడం మాత్రం.. డిజె టీజర్ కే చెల్లింది. అది అలా ఉంచింతే టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉందని.. అందరికీ థ్యాంక్స్.. అంటూ అల్లు అర్జున్ ట్వీటేసి థ్యాంక్స్ చెప్పాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కతున్న లేటెస్ట్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథమ్. బన్నీ పూర్తి మేకోవర్ లో కనిపిస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన డీజే టీం ఇప్పుడు టీజర్ తో రికార్డ్ ల వేట మొదలు పెట్టింది. గురువారం రిలీజ్ అయిన డీజే ఫస్ట్ లుక్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 50 గంటల్లో ఈ టీజర్ మిలియన్ వ్యూస్ మార్క్ ను దాటి బన్నీ కెరీర్ లో సరికొత్తి రికార్డ్ సృష్టించింది.

అదే జోరును కంటిన్యూ చేస్తూ 2 మిలియన్ మార్క్ ను దాటి దూసుకుపోతొంది. ఇప్పటికే 25 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన డీజే దువ్వాడ జగన్నాథమ్ టీజర్ ముందు ముందు మరిన్ని రికార్డ్ లు సృష్టిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

బ్రాహ్మణుడి గెటప్‌లో అల్లు అర్జున్ కనిపించిన ఈ టీజర్‌లో హీరోయిన్ పూజాహెగ్డే ముద్దుపెట్టుకున్న సన్నివేశం కనిపిస్తుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ 'ఇలాఇలా ముద్దులు పెట్టేసి సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని' అంటూ చెప్పిన డైలాగ్ అందరికీ నచ్చింది.

టీజర్ మంచి ఆదరణ పొందుతోందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. తమ సంస్థ నుండి సినిమా అంటేనే ప్రేక్షకులలో భారీ అంచనాలు వుంటాయని, అలాగే అల్లు అర్జున్ తమ సంస్థలో చేస్తున్న హ్యాట్రిక్ మూవీగా డి.జె నిలుస్తుందని నిర్మాత తెలిపారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిందని, అలాగే నేడు విడుదల చేసిన టీజర్‌కు కూడా ప్రేక్షకులనుండి ట్రెమండస్ రెస్పాన్స్ లభించిందని తెలిపారు.

సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని, ప్రేక్షకులకు అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను ప్రెస్టేజియస్‌గా రూపొందించామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఐనాక బోస్, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్:చోటా కె.ప్రసాద్, స్క్రీన్‌ప్లే:రమేశ్‌రెడ్డి, దీపక్‌రాజ్, నిర్మాతలు:రాజు, శిరీష్, కథ, మాటలు, దర్శకత్వం:హరీశ్ శంకర్.ఎస్.

English summary
The teaser of Allu Arjun's 'Duvvada Jagannadham' has become famous for the other reason, dislikes. The most awaited teaser of 'Duvvada Jagannadham' has become the talk of the town.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu