»   » అల్లు బ్రదర్స్ వ్యాఖ్యలకు పవన్ ఫ్యాన్స్ ప్రతీకారం.. అల్లు అరవింద్ క్షమాపణ..

అల్లు బ్రదర్స్ వ్యాఖ్యలకు పవన్ ఫ్యాన్స్ ప్రతీకారం.. అల్లు అరవింద్ క్షమాపణ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ మధ్య కోల్డ్‌వార్ ముదిరి పాకాన పడుతున్నది. అల్లు అర్జున్ చిత్రం దువ్వాడ జగన్నాధం చిత్రాల టీజర్ల 'డిస్‌లైక్స్' వ్యవహారం సోషల్ మీడియాలో వివాదాస్పదమవుతున్నది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ మధ్య వివాదానికి తెర దించేందుకు అల్లు కుటుంబం ప్రయత్నాలు చేపట్టినట్టు సమాచారం.

దువ్వాడ టీజర్‌కు లక్ష డిస్ లైక్స్

దువ్వాడ టీజర్‌కు లక్ష డిస్ లైక్స్

మంగళవారం నాటికే దువ్వాడ జగన్నాధం టీజర్‌కు దాదాపు లక్షకు పైగా డిస్‌లైక్ వచ్చాయి. గతంలో ఎన్నడూలేని విధంగా డిస్ లైక్స్ రావడం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పనే అనే భావనలో అల్లు కుటుంబం ఉన్నట్టు తెలుస్తున్నది.

చెప్పను బ్రదర్.. తో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం

చెప్పను బ్రదర్.. తో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం

ఈ వివాదానికి కారణం సరైనోడు ఆడియో కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌పై ‘చెప్పను బ్రదర్' అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాయి.

పవన్ వీపీ గాడు అని అల్లు శిరీష్

పవన్ వీపీ గాడు అని అల్లు శిరీష్

అల్లు అర్జున్ విషయం పక్కన పడితే ఇటీవల పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి వీపీ గాడు అంటూ అల్లు శిరీష్‌ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో దుమారం రేపాయి.

దువ్వాడ జగన్నాధంపై వ్యాఖ్యల ప్రభావం

దువ్వాడ జగన్నాధంపై వ్యాఖ్యల ప్రభావం

గతంలో నెలకొన్న విభేదాల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు తాజా సంఘటనలు మరింత బలాన్ని ఇచ్చాయి. సాయి ధరమ్ తేజ్ విన్నర్ ఆడియో రోజున దువ్వాడ జగన్నాధం ఫస్ట్ లుక్‌ను, విన్నర్ రిలీజ్ రోజున డీజే టీజర్ విడుదల చేయడంపై పవన్ అభిమానులు తప్పుపడుతున్నారు. ఇది అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు వారు ఆరోపిస్తున్నారు.

అల్లు ఫ్యామిలీకి పవన్ ఫ్యాన్స్ నరకం

అల్లు ఫ్యామిలీకి పవన్ ఫ్యాన్స్ నరకం

అప్పటి నుంచి అల్లు అర్జున్‌, శీరిష్‌కు వ్యతిరేకంగా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. వీలు చిక్కితే అల్లు కుటుంబంపై సోషల్ మీడియాలో నరకం చూపిస్తున్నారు. అందుకు ఉదాహరణే డీజే టీజర్ ఉదంతం. కాగా ఈ టీజర్‌కు చచ్చి చెడి కేవలం 2 మిలియన్ల లైక్స్ రావడం గమనార్హం. మెగా కాంపౌండ్‌కు సంబంధించిన టీజర్‌కు ఇంతా ప్రతికూలంగా స్పందన రావడం, పెద్ద ఎత్తున డిస్‌లైక్స్ రావడం ఇదే తొలిసారి.

పవన్‌తో రాజీకి అల్లు అరవింద్ ప్రయత్నం

పవన్‌తో రాజీకి అల్లు అరవింద్ ప్రయత్నం

పవన్ కల్యాణ్‌తో ఇంకా పెట్టుకొంటే కష్టమనే భావనలో అల్లు కుటుంబం ఉన్నట్టు సమాచారం. అందుకే జరిగిన సంఘటనలకు పవన్‌కు క్షమాపణలు చెప్పి ఇంతటితో ఈ వివాదానికి తెరవేయాలని అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆ క్రమంలో డీజేకు సంబంధించిన ఓ పాటను పవర్ స్టార్‌తో విడుదల చేసి పవన్ కల్యాణ్ అభిమానుల కోపాన్ని తగ్గించే పనిలో పనినట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని మెగా బ్రదర్స్ దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం.

English summary
The tussle between Pawan Kalyan and Allu Arjun fans becoming Ugly day by day. At Sarainodu function Allu Arjun refused Pawan fans by saying 'Cheppanu Brother' that had a became a talk of the town in social networks at that time. Allu Arjun's Duvvada Jagannadham teaser first time the teaser has received 100k likes so far.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu