»   » బన్నీ 'రేసుగుర్రం' కథ ఇదేనా?

బన్నీ 'రేసుగుర్రం' కథ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కి,విడుదలకు సిద్దమైన తాజా చిత్రం 'రేసుగుర్రం'. శ్రుతిహాసన్‌ హీరోయిన్. సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఏప్రియల్ 11 న ఈ చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలందించారు. ఈ చిత్రం కథ అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ కథనం ప్రచారంలో ఉంది. అదేమిటంటే...

అల్లు అర్జున్ , కిక్ శ్యామ్ అన్నదమ్ములు. శ్యామ్ పోలీస్ అధికారి. కిక్ శ్యామ్ రూల్స్‌ను పాటించే స్క్రిక్ట్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తే, ఎలాంటి రూల్స్‌ను లెక్కపెట్టకుండా లక్ష్యాన్ని సాధించే తమ్ముడిగా అల్లు అర్జున్ కనిపిస్తారు. వీళ్లిద్దరూ తరచూ కీచులాడుకుంటారు. అవి పెద్ద గొడవలు కాదు. కానీ వీరి తల్లికి మాత్రం వీరిద్దరిని రామలక్ష్మణుల్లా చూడాలని ఉంటుంది. ఇలా వీరిద్దరి గొడవలతో గడుస్తూండగా... శ్యామ్... ఓ అవినీతి మినిస్టర్ కి చెందిన క్రిమినల్ ఏక్టివిటీస్ పట్టుకుని అరెస్టు చేయటానికి రెడీ అవుతాడు. అయితే అతన్ని పట్టిచ్చే డాక్యుమెంట్స్ తన కారులో దాస్తాడు. అయితే ఆ కారుని అల్లు అర్జున్ వేసుకుని వెళ్లిపోతాడు. అయితే ట్విస్ట్ ఏమిటంటే... అల్లు అర్జున్ వద్ద నుంచి ఆ కారుని ఆ మినిస్టర్ కి చెందిన వారు దొంగిలిస్తారు. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి తన అన్నను ఆ మినిస్టర్ చంపాలనుకుంటున్నారు అని తెలుస్తుంది. అక్కడ నుంచి అతను తన అన్నను రక్షించటానికి, విలన్ దగ్గర చేరి, తన అన్నతో విరోధం ఉన్నట్లు చెప్పి,దగ్గర అవుతాడు. అక్కడ నుంచి అతని నాశనానికి అల్లు అర్జున్ ఏం చేసాడన్నది మిగతా కథ.

Allu Arjun's Race Gurram story?

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.... ''నా జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా ఇది. సురేందర్‌ రెడ్డి చాలా బాగా తీశారు. పరిశ్రమలో ప్రతి దర్శకుడు సినిమాతోపాటు నా హీరో బాగుండాలని కోరుకుంటాడు. వాళ్ల అభిరుచి వల్లే మేము తెరపై ఇంత అందంగా కనిపిస్తుంటాం. 'కిక్‌', 'బృందావనం' పాటలు విన్నాక తమన్‌తో పని చేయాలనిపించింది. ప్రపంచ స్థాయి సంగీతం తన దగ్గర ఉంటుంది.'' అన్నారు.

సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ... ''తెరపై బన్నీ రేసుగుర్రమైతే తెరవెనుక చిత్రబృందమంతా రేసుగుర్రాల్లా పరుగెత్తి పని చేశారు. తమన్‌ తన పాటలతో నాకు రెండింతలు కిక్‌ ఇచ్చాడు. ఈ సినిమా విజయం ఎప్పుడో ఖరారైంది. ప్రజల చప్పట్ల కోసమే ఎదురు చూస్తున్నా'' అన్నారు.

కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

English summary

 Story line of “Race Guarram” is creating sensation on net in film nagar too. How Allu Arjun saves his brother from goons and the film ends with brother’s sentiment.
Please Wait while comments are loading...