»   » సీక్రెట్ గా ... 'సర్దార్' ధియేటర్ లో అల్లు అర్జున్&కో

సీక్రెట్ గా ... 'సర్దార్' ధియేటర్ లో అల్లు అర్జున్&కో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు సినిమాలు బహిరంగంగా బయటకు వచ్చి ధియేటర్స్ లో చూడాలంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే అభిమానులు చుట్టుముట్టేస్తారు. వారిని కంట్రోలు చేయటం ధియేటర్ వారికీ ఇబ్బంది. అలాగే ఆ హంగామాలో సినిమా కూడా చూడటానికి వారికీ ఇబ్బందే.

అలాగని ధియేటర్ లో చూస్తేనే ఆ కిక్కు. ఆ కోరిక చంపుకోవటం కష్టం. అందుకే అప్పుడప్పుడూ కొద్దిగా గెపట్ లు ఛేంజ్ చేసి సీక్రెట్ గా ధియోటర్ లో దూరి సినిమాలు ఎంజాయ్ చేస్తూంటారు. జనం మధ్యలో కూర్చుని చూస్తే వచ్చే కిక్ ని అనుభవిస్తూంటారు.


Allu Arjun's secret Visit to Sardaar theatre

తాజాగా అల్లు అర్జున్ కు తన చిన్న మామయ్య... పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'సర్దార్' చూడాలనిపించింది. అదీ ఫ్యామిలితోనూ, ఫ్రెండ్స్ తోనూ కలిసి. అందుకేనేమో రాత్రి సెకండ్ షో కు హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ వద్ద ఉన్న మెయిన్ ధియేటర్ కు వచ్చి సీక్రెట్ గా సినిమా ప్రారంభమైన కాస్సేపటికి వచ్చి కూర్చుని, సినిమా క్లైమాక్స్ ముందు వెనక డోర్ నుంచి వెళ్లిపోయాడని సమాచారం.


ఈ సీక్రెట్ ట్రిప్ లో అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహా, ఆయన స్నేహితులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడా చిన్నపాటి హడావిడి కూడా చేయకుండా చాలా రహస్యంగా వచ్చి, తమ పని చూసుకుని వెళ్లిపోయారని సమాచారం. సినిమాని బాగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం.

English summary
Along with his wife Sneha, and other friends, out Allu Arjun went to a theatre in RTC X roads to catch up with "Sardaar Gabbar Singh".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu