ఎన్నారైలకు అల్లు అర్జున్ షాక్.. డబ్బులు పెట్టి వస్తే ఫోజులు కొడ్తావా?.. పవన్, రాంచరణ్ బెటర్..

అమెరికాలో దువ్వాడ జగన్నాథం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నారైలకు షాకిచ్చాడట. ఎంతో ఆశపడి చూద్దామని వచ్చిన తెలుగు సినీ అభిమానులను అల్లు అర్జున్ ఘోరంగా నిరాశకు గురిచ

By Rajababu

అమెరికాలో దువ్వాడ జగన్నాథం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నారైలకు షాకిచ్చాడట. ఎంతో ఆశపడి చూద్దామని వచ్చిన తెలుగు సినీ అభిమానులను అల్లు అర్జున్ ఘోరంగా నిరాశకు గురిచేశాడట. ఇప్పటి వరకు ఎంతో మంది సూపర్ స్టార్లు వచ్చారు కానీ సరిగా మాట్లాడకుండా మాతో ఇలా అల్లు అర్జున్‌లా వ్యవహరించడం ఇదే మొదటిసారి అని పలువురు ఎన్నారైలు ఆవేదన వ్యక్తం చేశారు. డీజే ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రత్యేకంగా చార్టెట్ ఫ్లయిట్..

ప్రత్యేకంగా చార్టెట్ ఫ్లయిట్..

డీజే ప్రమోషన్ కోసం వచ్చిన అల్లు అర్జున్‌తోపాటు చిత్ర యూనిట్‌ను స్థానిక తెలుగు సంస్థ ఆహ్వానించింది. న్యూజెర్సీ నుంచి షికాగోకు ప్రత్యేకంగా చార్టెట్ ఫ్లయిట్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతీ ఒక్కరి నుంచి 60 డాలర్ల ఫీజును వసూలు చేశారట. డబ్బులు పెట్టి ఎంతో దూరం నుంచి చూడటానికి వచ్చిన వారికి అల్లు అర్జున్ తీవ్రంగా నిరాశకు గురిచేశాడనే ప్రధాన విమర్శ.

అల్లు అర్జున్ గొంతెమ్మ కోరికలు

అల్లు అర్జున్ గొంతెమ్మ కోరికలు

మధ్యాహ్నం సమయానికి షికాగో చేరుకొన్న అల్లు అర్జున్‌ను నిర్వాహకులు స్వాగతం పలికారట. ఓ సరస్సు పక్కన ఏర్పాటు చేసిన గెస్ట్‌హౌస్‌లో రూమ్ ఏర్పాటు చేస్తే నిరాకరించారట. అంతేకాకుండా స్టార్ రూమ్‌లో గదిని కేటాయించాలని కోరడంతో అల్లు అర్జున్‌కు ఆ ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకుల్లో ఒకరు వెల్లడించారు. ఆ తర్వాత చాలా సేపు వేచి చూస్తే తప్పా బయటకు రాలేదనే వారి ప్రధాన ఆరోపణ.

కేవలం 20 నిమిషాలే..

కేవలం 20 నిమిషాలే..

ఎలాగోలా రాత్రి 10 గంటలకు వేదికకు చేరుకొన్న అల్లు అర్జున్ కొద్ది సేపు మాత్రమేనట. కేవలం 20 నిమిషాలు మాత్రమే అతిథులతో అల్లు అర్జున్ ముచ్చటించినట్టు సమాచారం. అది కూడా సినిమా రివ్యూల గురించి, పైరసీ గురించి మాట్లాడినట్టు సమాచారం. రివ్యూలను పరిగణనలోకి తీసుకోవద్దు, పైరసీని పోత్సాహించవద్దు అని అతిథులకు అల్లు అర్జున్ సూచించాడట. అనంతరం అక్కడి నుంచి జారుకొన్నారట. అక్కడి రావడం తనకు ఇష్టం లేదనే రీతిలో ప్రవర్తించాడని ఆ కార్యక్రమానికి హాజరైన వారు వెల్లడించడం గమనార్హం.

పవన్ కల్యాణ్ అందర్ని పలుకరించేవాడు..

పవన్ కల్యాణ్ అందర్ని పలుకరించేవాడు..

అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుపై ఎన్నారైలు మండిపడుతున్నారు. గతంలో మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లాంటి వచ్చారు. కానీ అల్లు అర్జున్ మాదిరిగా ప్రవర్తించలేదు. గతంలో పవన్ కల్యాణ్ ప్రతీ ఒక్కరిని కలుసుకోని అప్యాయంగా మాట్లాడేవారు. ఓ సారి కెనడా నుంచి వచ్చిన వారి గురించి తెలుసుకొని ప్రత్యేకంగా మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా నిర్వాహకులు దృష్టికి తీసుకొచ్చారు. తనను కలువడానికి వచ్చిన అభిమానులను ఉద్దేశించి సరిగా విష్ కూడా చేయలేదని పలువురు చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X