Just In
- 8 min ago
‘క్రాక్’ తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా: క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని
- 53 min ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
- 59 min ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 1 hr ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
Don't Miss!
- News
Capital Gains Tax అంటే ఏంటి..? బడ్జెట్ వేళ పూర్తి వివరాలు మీకోసం..!
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Sports
IPL 2021లో అత్యధిక ధర అతనికే.. ఎవరూ ఊహించరు కూడా!!
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్: ఆ విషయంలో అల్లు అర్జున్ అసంతృప్తి.. రిలీజ్‌కు ముంగిట ‘వైకుంఠపురములో’ కలకలం.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఎంత సక్సెస్‌ఫుల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వీళ్లిద్దరి కలయికలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ రెండింటి తర్వాత సక్సెస్‌ఫుల్ జోడీ చేస్తున్న చిత్రమే 'అల.. వైకుంఠపురములో'. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచే ఈ కాంబోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక, ఈ సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్ల వల్ల అవి రెట్టింపు అవుతున్నాయి. తాజాగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్?

వాటికి ఏమాత్రం తగ్గకుండా ప్లాన్
తాను తీస్తున్న సినిమాలో హీరో ఎవరైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం కుటుంబం మొత్తం చూసే విధంగానే తెరకెక్కిస్తాడు. ఆయన సినిమాలో బలమైన కథతో పాటు హత్తుకునే డైలాగులు ఉంటాయి. ఇప్పటికి ఆయన తీసిన సినిమాలన్నింటికీ ఇలాగే చేశాడు. ఇప్పుడు తీస్తున్న ‘అల.. వైకుంఠపురములో' మూవీని కూడా తన గత చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడట.

అవి సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి
ఎన్నో అంచనాలతో రాబోతున్న ‘అల.. వైకుంఠపురములో' నుంచి వస్తున్న ప్రతీ పాటకూ, టీజర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘సామజవరగమన', ‘రాములో రాములా' అంటూ సాగే పాటలు దక్షిణ భారతదేశంలోనే అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించి రికార్డులకెక్కాయి. దీంతో సినిమాపై ఆసక్తి పెరిగిపోతోంది.

అల్లు అర్జున్ ఫాలోయింగ్ వల్ల అక్కడ కూడా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు మలయాళంలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ ప్రతి సినిమా అక్కడ కూడా విడుదలవుతుంటుంది. దీంతో కలెక్షన్లు కూడా మంచిగానే వస్తుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే ఈ మూవీని కూడా ‘అంగు.. వైకుంఠపురత్తు' అనే టైటిల్‌తో మలయాళం భాషలో కూడా తెరకెక్కించి విడుదల చేస్తున్నారు.

ఆ విషయంలో అల్లు అర్జున్ అసంతృప్తి
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొత్తం ముగిసిందట. ఈ నేపథ్యంలో సినిమా రన్‌టైమ్ చూసుకుంటే 185 నిమిషాలు ఉందని అంటున్నారు. అంటే మూడు గంటలు కంటే ఐదు నిమిషాలు ఎక్కువన్న మాట. ఈ విషయంపై అల్లు అర్జున్ అసంతృప్తితో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.

రిలీజ్‌కు ముంగిట ‘వైకుంఠపురములో' కలకలం
వాస్తవానికి సినిమా ఫలితం రన్‌టైమ్ మీద ఆధారపడి ఉంటుందన్న టాక్ ఉంది. కంటెంట్ మంచి ఉన్నప్పటికీ ప్రేక్షకుడిని మూడు గంటల పాటు థియేటర్‌లో కూర్చోబెట్టడం కత్తి మీద సాము లాంటిదే. అందుకే ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత అందరూ షాక్‌కు గురవుతున్నారు. అయితే, 3 గంటలు ఉన్న ‘బాహుబలి', ‘అర్జున్ రెడ్డి' సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

త్రివిక్రమ్ ఇలా చేస్తున్నాడట
అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో' రన్ టైమ్ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో విషయం కూడా బయటకు వచ్చింది. బన్నీ సూచన మేరకు త్రివిక్రమ్ ఈ సినిమాలోని చాలా సన్నివేశాలను కత్తిరిస్తున్నాడని అంటున్నారు. మొత్తంగా ఈ మూవీని రెండున్నర గంటలకు కుదించాలని మాటల మాంత్రికుడు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.