»   » క్రేజీ డైరక్టర్ తో...అల్లు అర్జున్ తమిళ ప్రాజెక్టు ఓకే

క్రేజీ డైరక్టర్ తో...అల్లు అర్జున్ తమిళ ప్రాజెక్టు ఓకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్ తన మార్కెట్ ని విస్తరించుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే మళయాళంలో తనదైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న అల్లు అర్జున్ త్వరలో తమిళంలోనూ స్టైయిట్ సినిమాతో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ ప్రముఖ దర్శకుడుతో చర్చలు జరిపి ప్రాజెక్టు ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు లింగు స్వామి అని సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రన్, ఆవారా,పందెం కోడి వంటి లింగు స్వామి చిత్రాలు తమిళంలోతో పాటే తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. ఈ నేపధ్యంలో లింగు స్వామి చిత్రాలకు ఇక్కడా క్రేజ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే అల్లు అర్జున్ ఆ దర్శకుడుతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లింగు స్వామి గతంలో మహేష్,రామ్ చరణ్ లు కథ వినిపించారు కానీ వర్కవుట్ కాలేదు. తెలుగులో ఆయన కూడా అడుగు పెట్టాలనుకుంటున్నారు.

లింగుస్వామి తో బైలింగ్విల్ చిత్రం చేస్తే అటు తమిళం తనకు లాంచింగ్ ఫెరఫెక్ట్ గా జరిగుతుంది అన్నట్లు అల్లు అర్జున్ భావిస్తున్నారట. ఇక ఈ మేరకు ఓ లైన్ ని ఆల్రెడీ లింగు స్వామి..అల్లు అర్జున్ కు చెప్పి ఓకే చేయించారని తెలుస్తోంది.

Allu Arjun To Act Under Lingusamy’s Direction

ఇక ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మించే అవకాసం ఉంది. ఆయన రీసెంట్ గా లింగు స్వామి దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సికిందర్ చిత్రాన్ని తెలుగులో ప్రొడ్యూస్ చేసారు. అలాగే ఈ చిత్రానికి యవన్ శంకర్ రాజా సంగీతం ఇస్తారు. వచ్చే సంవత్సరం ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ లోగా అల్లు అర్జున్ తన ప్రాజెక్టులు ఫినిష్ చేసుకుంటారు.

అల్లు అర్జున్ తాజా చిత్రం విషయానికి వస్తే...

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అల్లు అర్జున్‌ ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు.

సకుటుంబంగా చూడదగ్గ కథలను వెండితెరపైకి ఎక్కించడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు త్రివిక్రమ్ చేస్తున్న తాజా ప్రయత్నం - అల్లు అర్జున్ హీరోగా, నిర్మాత ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం అల్లు అర్జున్, సమంత, నిత్యా మీనన్, రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, ఉపేంద్ర, స్నేహ తదితరులంతా ఈ షూటింగ్‌తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఛాయాగ్రాహకుడు ప్రసాద్ మూరెళ్ళ ఈ కీలక ఘట్టాలను కెమేరాలో బంధిస్తున్నారు.

గతంలో ఇదే దర్శక, నిర్మాత, హీరోల కాంబినేషన్‌లో 'జులాయి' చిత్రం రూపొందింది. ఆ విజయోత్సవ చిత్రాన్ని మించేలా ఇప్పుడీ చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్మాత రాధాకృష్ణ పేర్కొన్నారు. ఒక పక్క షూటింగ్ జరుగుతుండగానే, మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని, వేసవి కానుకగా ఏప్రిల్ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని సన్నాహాలు జరుపుతున్నారు.

English summary
Bunny he is willing to act under Lingusamy’s direction, Lagadapati Sridhar is most likely to produce this film on Sirisha Movies , shooting of the film will commence from next year.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu