»   » నిఖిల్ హీరోయిన్ తో అల్లు శిరీష్ రొమాన్స్

నిఖిల్ హీరోయిన్ తో అల్లు శిరీష్ రొమాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నిఖిల్ రీసెంట్ గా చేసిన "సూర్య వెర్సస్ సూర్య" లో హీరోయిన్ త్రిధా చౌదరి గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె ఇప్పుడు అల్లు శిరీష్ సరసన చేయబోతోందని సమాచారం. కొత్త జంట తర్వాత గ్యాప్ తీసుకున్న అల్లు శిరీష్ ...పరుసరామ్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి చుట్టాలబ్బాయి అనే టైటిల్ ని పెట్టారు. ఈ చిత్రంలో ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శిరీష్ ఇప్పటికే సిక్స్ ప్యాక్ పెంచి ఈ చిత్రం ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మొదట ఈ స్టోరీ లైన్ ని రామ్ కోసం తర్వాత రానా తో అనుకున్నారు. కానీ ఏదీ మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు నాగచైతన్య తో ఈ ప్రాజెక్టు ముందుకువెళ్లనుందని అనుకున్నారు. అదీ కాన్సిల్ అయ్యిందని తెలుస్తోంది. ఇప్పుడు అల్లు శిరీష్ దగ్గరకు వచ్చింది. ఈ చిత్రానికి చుట్టాలబ్బాయి అనే టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది.

Allu Sirish picks up Tridha Chowdary

కుటుంబ భావోద్వేగాల ప్రధానంగా జరిగే కథగా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. హీరో,హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా వర్కవుట్ చేసాడని అంటున్నారు. అల్లు అర్జున్ కు ఈ కథని నేరేట్ చేసాడని, అయితే తన కన్నా తన తమ్ముడు అయితే సూట్ అయ్యే అవకాసం ఉందని అల్లు అర్జున్ చెప్పాడంతో, అల్లు శిరీష్ కు నేరేట్ చేసాడని చెప్పుకుంటున్నారు.

సారొచ్చారు చిత్రం పరాజయంతో ఉన్న పరుశరామ్..ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. తొలి నాటి నుంచి డైలాగులుకు ఆయన ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. పూరీ శిష్యుడైన పరుశరామ్...ఆయన బాటలోనే కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం తో రెడీ అయ్యి హీరోలను కలిస్తూంటారు.

English summary
Allu Sirish third film will be directed by Parasuram of Anjaneyulu and Solo fame, and is likely to be titled “Chuttalabbayi”. Buzz has that Tridha Chowdary, who has acted as lead in Nikhil’s recent flick “Surya Vs Surya” is picked for the flick.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu