»   » మెగా కాంపౌండ్ లోకి పరుశరామ్ ఎంట్రీ

మెగా కాంపౌండ్ లోకి పరుశరామ్ ఎంట్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యువత, ఆంజనేయులు, సోలో, సారొస్తారా చిత్రాలు డైరక్ట్ చేసిన పరుశరామ్ గత కొంత కాలంగా ఖాళీగా ఉన్నారు. అయితే రీసెంట్ గా ఆయన కథ మెగా కాంపౌండ్ లో ఓకే అయ్యినట్లు విశ్వసనీయ సమాచారం. హీరో మరెవరో కాదు అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్. గౌరవం, కొత్త జంట చిత్రాలు చేసిన అల్లు శిరీష్ గత కొంత కాలంగా కథలు వింటున్నారు. అయితే ఏదీ ఓకే చేయటం లేదు. రీసెంట్ గా పరుశరామ్ చెప్పిన లైన్ విని ఓకే చేసినట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మొదట ఈ స్టోరీ లైన్ ని రామ్ కోసం తర్వాత రానా తో అనుకున్నారు. కానీ ఏదీ మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు నాగచైతన్య తో ఈ ప్రాజెక్టు ముందుకువెళ్లనుందని అనుకున్నారు. అదీ కాన్సిల్ అయ్యిందని తెలుస్తోంది. ఇప్పుడు అల్లు శిరీష్ దగ్గరకు వచ్చింది. ఈ చిత్రానికి చుట్టాలబ్బాయి అనే టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది.

Allu Sirish in the direction of Parasuram

కుటుంబ భావోద్వేగాల ప్రధానంగా జరిగే కథగా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. హీరో,హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా వర్కవుట్ చేసాడని అంటున్నారు. అల్లు అర్జున్ కు ఈ కథని నేరేట్ చేసాడని, అయితే తన కన్నా తన తమ్ముడు అయితే సూట్ అయ్యే అవకాసం ఉందని అల్లు అర్జున్ చెప్పాడంతో, అల్లు శిరీష్ కు నేరేట్ చేసాడని చెప్పుకుంటున్నారు.

సారొచ్చారు చిత్రం పరాజయంతో ఉన్న పరుశరామ్..ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. తొలి నాటి నుంచి డైలాగులుకు ఆయన ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. పూరీ శిష్యుడైన పరుశరామ్...ఆయన బాటలోనే కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం తో రెడీ అయ్యి హీరోలను కలిస్తూంటారు.

English summary
Allu Sirish is readying for his next. According to the latest he is teaming with Parasuram for his next film.
Please Wait while comments are loading...