»   » 'అనామిక' లీకైంది : క్లైమాక్స్ లో మార్చిన ట్విస్ట్ ఇదే

'అనామిక' లీకైంది : క్లైమాక్స్ లో మార్చిన ట్విస్ట్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అనామిక'. హిందీలో విజయవంతమైన 'కహానీ' సినిమా ఆధారంగా రూపొందుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఒరిజనల్ లేని చాలా ట్విస్టులను,కథనాన్ని మార్చి రెడీ చేసారు. ఈ చిత్రంలో మొదటినుంచీ చెప్తున్నట్లుగానే నయనతారని ప్రెగ్నింట్ లేడీగా చూపించటం లేదు. అలాగే బ్యాక్ డ్రాప్ సైతం కలకత్తా నుంచి పాత బస్తీకి నేటివిటీ కోసం మార్చారు. అయితే ఒరిజనల్ లో క్లైమాక్స్ లో ఆమె ప్రెగ్నింట్ లేడీ కాదని రివిల్ అవటమే ట్విస్టు. దాన్ని ఇక్కడ మార్చారని తెలుస్తోంది. ఆ ట్విస్ట్ ఏమిటనేది లీకైంది.

మీడియా వర్గాల్లో వినపడుతున్నదాన్ని బట్టి....క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టు ఏమిటంటే...ఆమె భర్త దొరకటం, అతనే మెయిన్ విలన్ అని తేలతుంది. మెట్రో రైలు ప్రమాదంలో మరణించిన చాలా మందిలో తన భర్త లేడని, తన భర్తే వీటిన్నటి వెనక ఉన్నాడని తెలుసుకుని అతన్ని చంపేస్తుంది. ప్రెగ్నింట్ గా యాజటీజ్ గా ఉంచితే, ఆల్రెడీ హిందీ సినిమా పెద్ద హిట్ కావటంతో ఆ ట్విస్ట్ ఎంజాయ్ చేయరని, అందుకే ఇలా మార్చారని తెలుస్తోంది. అయితే ఈ ట్విస్ట్ ఎంతవరకూ థియోటర్ లో వర్కవుట్ అవుతుందనే విషయమై విజయం నిర్ణయం కానుందనేది వాస్తవం.

Anamika climax twist Changed

అక్కడ విద్యాబాలన్‌ పోషించిన పాత్రలో ఇక్కడ నయనతార నటిస్తోంది. వైభవ్‌, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఎండమోల్‌ ఇండియా, లాంగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సెన్సార్ ఇప్పటికే పూర్తైంది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ని మే 1 విడుదల చేస్తున్నారు.

నయనతార మాట్లాడుతూ ''స్త్రీ ప్రాధాన్యమున్న సినిమాలో నటించడం చాలా ఆనందాన్నిస్తోంది. అనామికగా కొత్త నయనతారని చూస్తారు. కహాని' సినిమాలో చాలా మార్పులు చేశారు. నా పాత్ర తీరుతెన్నులు కూడా మారాయి. నా శైలిలోనే నటించాను. ఎంత రీమేక్‌ అయినా మార్పులు, చేర్పులూ అవసరం. మక్కీకి మక్కీ తీస్తే చూడ్డానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒక వేళ అలాంటి కథలే నాముందుకు వస్తే అంగీకరించను. శేఖర్‌ శైలి తెలుసు కాబట్టి, ఆయన మార్పులు నచ్చాయి కాబట్టి 'కహాని' ఒప్పుకున్నా'' అన్నారు.

అలాగే...నా దృష్టిలో ఇదొక ప్రత్యేకమైన చిత్రం. 'కహానీ' ఆధారంగా రూపొందుతున్న చిత్రమే అయినా... రెండింటిమధ్య ఏమాత్రం పోలికలు కనిపించవు. మన వాతావరణానికి తగ్గట్టుగా కథలో పూర్తిస్థాయిలో మార్పులు చేశారు శేఖర్‌ కమ్ముల. విద్యాబాలన్‌ పోషించిన పాత్రతో నా పాత్రని ఎవ్వరూ పోల్చి చూసుకోలేరు. అంత వైవిధ్యంగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకొనే ఓ మంచి చిత్రమవుతుంది అంటూ నయనతార చెప్పుకొచ్చింది.

శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ''భర్తను వెతుక్కొంటూ ఓ యువతి హైదరాబాద్‌ నగరంలో చేసిన పోరాటమే ఈ సినిమా. ఆమె ప్రయత్నం ఫలించిందా లేదా అనేది కీలకాంశం. 'కహానీ' కథకు పలు మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. ''అన్నారు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. కీరవాణితో పని చేయడం శేఖర్‌కి ఇదే ప్రథమం. అనామిక చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసరాల్లో సాగుతోంది. ఈ చిత్రంలో వైభవ్‌ పోలీసు కానిస్టేబుల్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ కథలో కీలకమైన పాత్ర ఇది.

''పెళ్త్లెన ఓ మహిళ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆమె ఎవరి కోసం అన్వేషణ ప్రారంభించింది? జీవితంలో ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంది? అనే విషయాలు ఆసక్తికరం. ఎం.ఎం.కీరవాణి స్వరాలు చిత్రానికి బలాన్నిస్తాయి''అని నిర్మాత చెబుతున్నాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌.

English summary

 In Anamica original version main lead struggled to do justice for her lost husband who was dead in Metrorail due to poisonous gas leakage and she finally kills the accused in climax, but in this remake version she found that her husband is the main accused (main villain) behind the Metrorail incident which caused many people death and finally she kills her husband.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu