రంగస్థలంలో అనసూయ పాత్ర లీక్.. ఎలాంటి రోల్ అంటే..
Recommended Video

మెగా పవర్ స్టార్ రాంచరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న రంగస్థలం లేటు అయినప్పటికీ లేటేస్ట్‌గా వస్తున్నది. రిలీజ్‌కు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో అనసూయకు సంబంధించిన పాత్ర వివరాలు లీక్ అవ్వడం సెన్సేషనల్‌గా మారింది.

రంగస్థలంలో అనసూయ
జబర్థస్త్ లాంటి టెలివిజన్ చిత్రాలు చేస్తూనే యాంకర్ అనసూయ సినీరంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. 1980 నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరెకెక్కుతున్న రంగస్థలం చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నది.

రాంచరణ్‌తో అనసూయ సెల్ఫీ
గతంలో రాంచరణ్‌తో చిత్ర షూటింగ్‌లో ఓ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ చిత్రంలో ఓ అద్భుతమైన పాత్రను పోషిస్తున్నానంటూ చెప్పింది. అయితే వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.

పాత్రేంటో చెప్పనన్నఅనసూయ
అలాగే కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్ లైవ్ సందర్భంగా తన పాత్ర వివరాలను వెల్లడించడానికి ఇష్టపడలేదు. కానీ చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర అంటూ చిన్న క్లూ ఇచ్చింది.

రాంచరణ్‌కు మేనత్తగా అనసూయ
అయితే రంగస్థలం చిత్రంలో రాంచరణ్‌కు అనసూయ మేనత్తగా నటిస్తున్నారట. ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన లుక్‌లో కనిపించనున్నట్టు సమాచారం. అయితే తన పాత్ర పరిధి మేరకు ఓ మార్క్‌తో అదరగొట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తున్నది.
మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో సమంతతోపాటు జగపతిబాబు, ఆది పినిశెట్టి, రావు రమేశ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ నెలలో రీలీజ్‌కు సిద్ధమవుతున్నది.


Click it and Unblock the Notifications











