Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మరో స్టార్ హీరో సినిమాలో యాంకర్ అనసూయ స్పెషల్ రోల్
గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్న జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మళ్ళీ సినిమాలతో బిజీబిజీగా మారింది. ఒకవైపు షోలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలతో కూడా బిజీబిజీగా మారుతోంది. పాత్ర నచ్చితే చేయడానికి ఎల్లప్పుడు సిద్ధమే అంటూ మంచి రోల్స్ ఎంచుకుంటోంది. ఇక మొదటిసారి ఆమె మలయాళం ఇండస్ట్రీలోకి కూడా వెళుతున్నట్లు టాక్ వస్తోంది.
రంగస్థలంలో రంగమ్మత్తగా కనిపించినప్పటి నుంచి కూడా అనసూయ తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ మధ్య నాగార్జున సోగ్గాడే చిన్న నాయన సినిమాలో కూడా టైటిల్ సాంగ్ తో రచ్చ చేసిన అనసూయ క్షణం వంటి సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించి నటిగా తన స్థాయిని మరింత పెంచుకుంది. రంగస్థలం సినిమాతో అనసూయ రేంజ్ మరో లెవెల్ కు వెళ్లిందనే చెప్పాలి.

ఇక మళయాళం ఇండస్ట్రీలో కూడా అడుగుపెడుతున్నట్లు టాక్ వస్తోంది. మళయాళం స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా నటిస్తున్న భీష్మ పర్వంలో ఆమె ఒక ముఖ్యమైన పాత్ర కోసం సెలెక్ట్ అయినట్లు సమాచారం. పాత్ర నచ్చడంతో అనసూయ కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఒప్పుకున్నట్లే టాక్ వస్తోంది. అలాగే గోపీచంద్ రాబోయే సినిమాలో ఒక ప్రయోగాత్మకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గోపిచంద్ మారుతి కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో గతంలో ఎప్పుడు కనిపించని విభిన్నమైన పాత్రలో అనసూయ దర్శనమివ్వనుందట.